Pushpa 2: పుష్ప 2లో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న సుకుమార్.. సమంతను రీప్లేస్ చేస్తున్నది ఎవరంటే..

|

Oct 10, 2022 | 11:31 AM

స్టార్ హీరోయిన్ కాజల్ నటించనున్నట్లుగా టాక్ నడిచింది. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Pushpa 2: పుష్ప 2లో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న సుకుమార్.. సమంతను రీప్లేస్ చేస్తున్నది ఎవరంటే..
Pushpa 2
Follow us on

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసుళ్లూ రాబట్టింది. అంతేకాకుకండా ఈ మూవీతో అల్లు అర్జున్, రష్మిక మందన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. సౌత్ టూ నార్త్ పుష్ప పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. ప్రస్తుతు ఈ చిత్రానికి సిక్వెల్ పుష్ప 2 చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. సిక్వెల్ లోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందట. స్టార్ హీరోయిన్ కాజల్ నటించనున్నట్లుగా టాక్ నడిచింది. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.

పుష్ప 2లో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఫస్ట్ పార్ట్‏లో సమంత స్పెషల్ సాంగ్‏తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట సుకుమార్. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ మరింత పవర్ ఫుల్ లుక్‏లో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో రష్మిక పాల్గోననుంది.

పుష్ప 2 పై ఇప్పటికే భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, సాయి పల్లవి, విజయ్ సేతుపతి నటించనున్నారని రూమర్స్ వినిపించాయి. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు పుష్ప ప్రొడ్యూసర్ రవిశంకర్.