Tamannaah Bhatia: నెటిజన్లతో మిల్కీబ్యూటీ చిట్‏చాట్.. మెగాస్టార్ సినిమా గురించి అసలు విషయం బయటపెట్టేసిన తమన్నా..

|

Jul 06, 2022 | 8:27 AM

ఇప్పుడు మరోసారి మిల్కీబ్యూటీ నుంచి అద్భుతమైన డ్యాన్స్ ఆశించవచ్చా ? అంటూ ఓ నెటిజన్ తమన్నా ప్రశ్నించాడు. దీంతో ఆసక్తికర రిప్లై ఇచ్చింది మిల్కీబ్యూటీ.

Tamannaah Bhatia: నెటిజన్లతో మిల్కీబ్యూటీ చిట్‏చాట్.. మెగాస్టార్ సినిమా గురించి అసలు విషయం బయటపెట్టేసిన తమన్నా..
Tamannah
Follow us on

మిల్కీబ్యూటీ తమన్నాకు (Tamannaah Bhatia) యూత్‍లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తమన్నా.. నటనపరంగానే కాదు.. డ్యాన్స్‏తోనూ ప్రేక్షకుల మనసులు కొట్టగొడుతుంది. హీరోలతో పోటీపడి మరీ క్లిష్టమైన స్టెప్పులను సులువుగా చేసేస్తుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్.. స్వింగ్ జరా, డాంగ్ డాగ్, కోడ్తే వంటి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్స్ ఆమె కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి మిల్కీబ్యూటీ నుంచి అద్భుతమైన డ్యాన్స్ ఆశించవచ్చా ? అంటూ ఓ నెటిజన్ తమన్నా ప్రశ్నించాడు. దీంతో ఆసక్తికర రిప్లై ఇచ్చింది మిల్కీబ్యూటీ.

మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించింది తమన్నా. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ నంబర్ మేము ఆశించవచ్చా ? అని ఓ నెటిజన్ అడగ్గా.. నేను ప్రామిస్ చేస్తున్నాను.. మీరు ఎప్పటికీ నిరాశ చెందరు అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో భోళా శంకర్ సినిమాలో తమన్నా.. చిరు కలిసి చేసే సాంగ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే.. తాను ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటిలో తనకు అత్యంత ప్రత్యేకమైన క్యారెక్టర్స్ రెండు ఉన్నాయని తెలిపింది. ధర్మధురై చిత్రంలో శుభాషిణి పాత్ర.. బాహుబలిలో హవంతిక పాత్రలను తాను నిజంగా ఆస్వాదిస్తున్నానని తెలిపారు. అలాగే ఎఫ్ 3 సినిమాలో అబ్బాయి పాత్రలో నటించడం తనకు పెద్ద సవాలుగా అనిపించిందని.. కానీ ఆ పాత్రకు అనేక ప్రశంసలు వచ్చినట్లు తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..