
ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను నియమించింది. అయితే దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా భాటియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవల బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తోందీ అందాల తార. ఇక గ్లామర్‌లో ఈ బ్యూటీని వంక పెట్టడానికి ఏమీ లేదు. ఇలా నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న తమన్నాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడం వల్ల ఈ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుండవచ్చు. ఇప్పటికే అనేక బ్యూటీ బ్రాండ్లు ఇప్పటికే తమన్నా భాటియాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు మైసూర్ శాండల్ సోప్ కూడా ఈ హీరోయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాతో రెండేళ్ల పాటు ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని కోసం మిల్కీ బ్యూటీకి భారీ మొత్తంలో రూ. 6.20 కోట్లు చెల్లించినట్లు ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే తమన్నాకు బదులుగా కన్నడ నటీమణలను నియమించాల్సిఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
దీపికా పదుకొనే కర్ణాటకకు చెందినది. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లింది. కన్నడలో ఇలాంటి నటీమణులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ స్పందించారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. కానీ, కెఎస్‌డిఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తాము పాన్-ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేశామన్నారు.
Karnataka Government Sanctioned 6.2Cr to appoint actress #TamannaahBhatia as brand ambassador for Mysore Sandal Soap for 2yrs#Kannada #Karnataka #Sandalwood pic.twitter.com/dtrfpvrm8R
— Karnataka Box Office (@Karnatakaa_Bo) May 22, 2025
కాగా ఇటీవల ఓదెల 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది తమన్నా. అలాగే అజయ్ దేవ్ గణ్ రైడ్ 2 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో సందడి చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..