ctress Tamanna: లావయ్యిందంటూ.. ఇటీవల ట్రోల్స్‌ను ఎదుర్కొన్న తమన్నా… ఇప్పుడు లావు తగ్గే పనిలో పడ్డారు. మునుపటిలా నాజూకుగా మారేందుకు జిమ్ లలో తెగ కష్టపడుతున్నారు. మళ్లీ ఫర్ఫెక్ట్ బాడీని తొందర్లో సంపాదించి తనని ట్రోల్ చేసిన నెటిజన్లతోనే వావ్ అనిపించుకుంటా అంటూ భారీగా కసరత్తులు చేస్తున్నారు తమన్నా. ఇలా కష్టపడడమే కాదు.. ఈ కష్టాన్ని అంతా ఓ వీడియో తీసి తన అభిమానులతో పంచుకున్నారు తమన్నా. అంతేకాదు ఇది చూసి.. మీరు కూడా ఫిట్‌గా.. ఆరోగ్యంగా తయారు కావాలని అందరికీ చెబుతున్నారు. ఇక మిల్కీ బేబీ కష్టాన్ని చూసిన కొంత మంది ట్రొలర్స్ ఏదో సరదాగా అంటే మరీ ఇంత కష్టపడాలా తమన్నా .. నీ కష్టాన్ని చూడలేకపోతున్నాం అంటూ.. కమెంట్లు చేస్తున్నరు.
ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూవీస్ తోపాటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆహా ద్వారా ’11th అవర్’ వెబ్ సిరీస్ తో వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. మరో వైపు గోపీచంద్ హీరో గా నటిస్తున్న సీటీమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడనుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :