Taapsee Pannu: తన డ్రీమ్ రోల్ గురించి బయటపెట్టిన తాప్సీ.. ఇండియన్ సూపర్ హీరో అంటున్న హీరోయిన్..

|

Jul 07, 2022 | 8:58 AM

చాలా మంది అనేక సందర్భాల్లో నన్ను అడుగుతుంటారు మీ డ్రీమ్ రోల్ ఏంటీ ? అని. నాకు ఒకే ఒక కల.. అదే నా డ్రీమ్ రోల్. మొదటి నుంచి నేను

Taapsee Pannu: తన డ్రీమ్ రోల్ గురించి బయటపెట్టిన తాప్సీ.. ఇండియన్ సూపర్ హీరో అంటున్న హీరోయిన్..
Taapsee Pannu
Follow us on

స్టార్ హీరో తాప్సీ పన్నూ (Taapsee Pannu) ప్రస్తుతం బాలీవుడ్‏లో సత్తా చాటుతోంది. అక్కడ చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శభాష్ మిథు. టీమిండియా మాజీ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన డ్రీమ్ రోల్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

తాప్సీ మాట్లాడుతూ.. ” చాలా మంది అనేక సందర్భాల్లో నన్ను అడుగుతుంటారు మీ డ్రీమ్ రోల్ ఏంటీ ? అని. నాకు ఒకే ఒక కల.. అదే నా డ్రీమ్ రోల్. మొదటి నుంచి నేను అవెంజర్స్ లో భాగం కావాలనుకుంటున్నాను. అందులో నేను ఇండియన్ సూపర్ హీరోగా నటించాలనుకుంటున్నాను. అందుకు అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆ అవకాశం కోసం ఎవరైన మార్గం చూపిస్తే తప్పకుండా నేను దానిని అనుసరిస్తాను. ప్రస్తుతం నేను కొత్త ప్రాజెక్ట్ నిర్మించేందుకు సిద్ధమయ్యాను. అందులో సమంత ప్రధాన పాత్రలో నటించనుంది. ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల విడుదలైన శభాష్ మిథు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ మూవీ జూలై 15న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇదే కాకుండా తాప్సీ.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీల కలిసి నటిస్తోన్న డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.