
గత ఏడాది వచ్చిన సినిమాల్లో సంచలన హిట్ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగ తన స్టైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాలో హింస ఎక్కువ చూపించారని, మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు చూపించడం పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ యానిమల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది యానిమల్. యానిమల్ సినిమా పై ఇప్పటికే చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. చాలా మంది సినీ తారలు కూడా యానిమల్ సినిమా పై ప్రశంసలు కురిపించారు.
తాజాగా యానిమల్ సినిమా పై హాట్ బ్యూటీ తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్ చేసింది. తాప్సీపన్ను టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
అంతే కాదు ఫైర్ బ్రాండ్ గా మారింది. ఇప్పటికే తాప్సీపన్ను చాలా వివాదస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా యానిమల్ సినిమా పై కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యానిమల్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ. సినిమా యాక్టర్స్ కు ఓ పవర్ ఉంటుంది. అలాగే సమాజం పై బాధ్యత కూడా ఉండాలి.మిగిలిన వారందరూ దీని పాటించాలని నేను చెప్పడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం మనకు నచ్చింది చెయ్యొచ్చు.. అయితే నేను మాత్రం యానిమల్ లాంటి సినిమాలో నటించే దాన్ని కాదు అని చెప్పుకొచ్చింది తాప్సీపన్ను.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.