Sreeleela: ఇదెక్కడి ట్విస్ట్..! బాలీవుడ్ సినిమానుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం ఇదే

|

Aug 02, 2024 | 9:21 AM

కన్నడలో ‘కిస్’ సినిమాతో హీరోయిన్ గా మారిన నటి శ్రీలీల.. ‘భారత్’, ‘బై టు లవ్’ సినిమాల్లో నటించి పాపులర్ అయింది. అలాగే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ చిన్నది. రవితేజతో ‘ధమాకా’ సినిమాతో హిట్ అందుకొని క్రేజ్ సొంతం చేసుకుంది. శ్రీలీల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో పాటు స్టార్ నటులు నటించింది ఈ బ్యూటీ. శ్రీలీల తన క్రేజ్‌తో బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

Sreeleela: ఇదెక్కడి ట్విస్ట్..! బాలీవుడ్ సినిమానుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం ఇదే
Sreeleela
Follow us on

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతోఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు  చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కన్నడలో ‘కిస్’ సినిమాతో హీరోయిన్ గా మారిన నటి శ్రీలీల.. ‘భారత్’, ‘బై టు లవ్’ సినిమాల్లో నటించి పాపులర్ అయింది. అలాగే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ చిన్నది. రవితేజతో ‘ధమాకా’ సినిమాతో హిట్ అందుకొని క్రేజ్ సొంతం చేసుకుంది. శ్రీలీల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో పాటు స్టార్ నటులు నటించింది ఈ బ్యూటీ. శ్రీలీల తన క్రేజ్‌తో బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే శ్రీలీల తొలి బాలీవుడ్ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ మూవీకి శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు డేట్ సమస్యల కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ లేకుండానే సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై చిత్ర నిర్మాత రమేష్ తురాని క్లారిటీ ఇస్తూ.. ‘ఇది తప్పుడు వార్త, ఈ సినిమాలో కథానాయికగా ఎవరినీ ఎంపిక చేయలేదు. హీరోయిన్ బడ్జెట్ ఖరారు కాకపోవడంతో హీరోయిన్ గా ఎవరినీ పెట్టలేదు. అయితే ప్లాన్ ప్రకారం ఒక నెల షూటింగ్ పూర్తి చేశాం. కొంత మంది నటీమణుల గురించి చర్చ జరుగుతోందని, కథానాయికను ఖరారు చేసిన తర్వాత సమాచారం ఇస్తాం అన్నారు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో రమేష్ తురాని మాట్లాడుతూ..శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

నటి శ్రీలీల ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఓ హిందీ సినిమా కూడా ఉంది. తెలుగులో ‘రాబిన్ హుడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే రవితేజ 75వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజతో శ్రీలీల నటిస్తున్నరెండో సినిమా ఇది. పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయింది. శ్రీలీల హిందీలో ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో కూడా నటిస్తోంది. వీటితో పాటు శ్రీలీల కొత్త తమిళ సినిమాను కూడా అంగీకరించినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ అని టాక్ వినిపించింది. అయితే ఆ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే వీటన్నింటి పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.