Sreeleela: దెబ్బలు పడతాయ్‌ రో! శ్రీలీలతో అభిమానుల అనుచిత ప్రవర్తన.. అందరి ముందే పట్టి లాగేసి.. వీడియో

సినిమా తారలను చూడాలని, వారితో కలిసి కనీసం ఒక్క ఫొటో అయినా దిగాలని ఎంతో మంది తాపత్రపడుతుంటారు. సినిమా సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కు ఎంతో గౌరవమిస్తారు. సమయం కుదిరినప్పుడల్లా తమ అభిమానులను కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇదే క్రమంలోనే శ్రీలీలకు ఒక చేదు అనుభవం ఎదురైంది.

Sreeleela: దెబ్బలు పడతాయ్‌ రో! శ్రీలీలతో అభిమానుల అనుచిత ప్రవర్తన.. అందరి ముందే పట్టి లాగేసి.. వీడియో
Sreeleela

Updated on: Apr 06, 2025 | 3:33 PM

ఈ మధ్యన తెలుగులో వరుసగా అపజయాలు ఎదుర్కొంటోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల. అందుకే గతేడాది గుంటూరు కారం సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుంది. పుష్ప 2లో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది. ఇక ఇటీవల శ్రీలీల నటించిన మరో సినిమా రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ మూవీలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ను నిరాశపర్చింది. దీంతో శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ పడింది. అయితే ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు టాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోంది యంగ్ సెన్సేషన్. హ్యాండ్సమ్ అండ్ రొమాంటిక్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ స్టోరీ లో నటిస్తోంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హీరో కార్తీక ఆర్యన్, శ్రీలీల హాజరయ్యారు. అయితే స్టేజ్ దగ్గరకు వెళుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు శ్రీలీలను పట్టి లాగేశారు. అయితే సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే స్పందించి నటిని స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చారు. అందరూ చూస్తుండగానే అభిమానులు ఇలా చేయడంతో శ్రీలీల షాక్ లో మునిగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన శ్రీలీల అభిమానులు బాగా ఫీలవుతున్నారు. మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా అని ఆకతాయిలపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తోందంటూ కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తన కోడలు డాక్టరయితే బాగుంటుందని కార్తీక్ ఆర్యన్ తల్లి ఓ సందర్భంలో చెప్పడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే ఇవన్నీ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో పక్కనుండగానే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.