Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి.. ఆ తర్వాత తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా 51 ఏళ్ల వయసులో అందానికి రహస్యం రివీల్ చేసింది.

Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
Sonali Bendre

Updated on: Jan 01, 2026 | 7:15 PM

తెలుగు సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో సోనాలి బింద్రే ఒకరు. ఈరోజు ఈ ముద్దుగుమ్మ 51వ పుట్టినరోజు. తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర దాదా ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో అందం, అభినయంతో కుర్రవాళ్ల హృదయాలు గెలుచుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. 2018లో స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ నుంచి బయటపడేందుకు న్యూయార్క్ లో కఠినమైన చికిత్స తీసుకుని 2021 నాటికి పూర్తిగా కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

ఇదెలా ఉంటే.. ఇప్పుడు తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది సోనాలి బింద్రే. ఇటీవల ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ తో తన ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తన డైట్ సీక్రెట్స్ పంచుకున్నారు. తాను రాత్రి భోజనం సాయంత్రం 6.30 లేదా 7 గంటల లోపు చేస్తానని అన్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కోని ఉండడం.. పార్టీల పేరుతో బయట తిరగడం తనకు అస్సలు నచ్చనది చెప్పుకొచ్చింది. తాను మహారాష్ట్ర కుటుంబం నుంచి వచ్చానని.. తన భర్త గోల్డీ బెహల్ పంజాబీ కుటుంబంలో జన్మించారని అన్నారు. పెళ్లైన మొదట్ల తన భర్త ఇంట్లో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

అలాగే ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం కాకుండా.. కూరగాయలు, మొలకలు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటానని అన్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే తాను క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని జయించినట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడంతోపాటు మానసిక ప్రశాంతత కోసం యోగా సైతం చేస్తానని అన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..