
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకోవాల్సిన తారలు అనుహ్యంగా సినీపరిశ్రమకు దూరమయ్యారు. అలాంటివారిలో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఒకరు. తెలుగులో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకుంది. నీలి కళ్లు… చూడచక్కని రూపంతో కట్టిపడేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో నటించిన స్నేహా.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
2015 నుంచి సినిమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాల విషయంలో తాను పెట్టుకున్న హద్దులు … కెరీర్ విషయంలో తనను ఎదగనీయకుండా చేసిందని అంటున్నారు. గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్లే తాను హీరోయిన్ గా వెనకబడ్డానని తెలిపింది. స్నేహా ఉల్లాల్ మాట్లాడుతూ.. “మనం ఏది చేయకూడదు అనుకుంటామో కొన్నిసార్లు అవే పనులు చేయాల్సి వస్తుంది. నాకు స్పెషల్ సాంగ్స్ చేయడం ఇష్టం ఉండదు. కానీ గతంలో అలాంటి పాటలే చేయాలనే ఆఫర్స్ వచ్చాయి. చాలా రిజెక్ట్ చేశాను. అప్పుడే నా రూల్స్ బ్రేక్ చేసి ఉంటే అవకాశాలు పెరిగేవి” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?