Simran : ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్.. చంపేసారండీ బాబు.. డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. వీడియో వైరల్..

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రీఎంట్రీలో దూసుకుపోతుంది.

Simran : ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్.. చంపేసారండీ బాబు.. డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. వీడియో వైరల్..
Simran

Updated on: Mar 16, 2026 | 12:33 PM

టాలీవుడ్ సినీప్రియులకు హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చాలా కాలంగా సినిమలాకు దూరంగా ఉన్న సిమ్రాన్.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. అయితే మళ్లీ నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి సిమ్రాన్ నృత్య కదలికలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఆమె డ్యాన్స్ చేసినప్పుడు చేసేటప్పుడు ఆమె శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలోనూ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సిమ్రాన్.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో హిప్ హాప్ డ్యాన్స్ అదరగొట్టేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “నేను హిప్ హాప్ జోన్‌లోకి అడుగుపెడుతున్నాను, ఈ శక్తిని నేను ఇష్టపడుతున్నాను” అంటూ రాసుకొచ్చింది. అలాగే “నెవర్ స్టాప్ లెర్నింగ్” అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఈ వీడియోలో హిప్ హాప్ డ్యాన్స్ లో ఫుల్ ఎనర్జీతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సిమ్రాన్ ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోకు అర మిలియన్ కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

కేవలం తొమ్మిది సంవత్సరాలలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో అద్భుతమైన హీరోయిన్‌గా మారింది. సిమ్రాన్ 2003లో తన సన్నిహితుడు దీపక్‌తో ఏడడుగులు వేసింది. వీరికి బాబు ఉన్నారు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్.. ఇప్పుడు తిరిగి నటిస్తుంది. రెండవ ఇన్నింగ్స్‌లో సిమ్రాన్ తల్లి పాత్రను పోషించడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం ప్రారంభించింది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us