AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakeela: షకీలా‌పై దాడి.. పోలీసులను ఆశ్రయించిన నటి.. కూతురే కిరాతకంగా..

ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్న షకీలా ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షకీలా. ఇదిలా ఉంటే షకీలా పై దాడి జరిగిందని తెలుస్తోంది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. షకీలా పై దాడి చేసింది మరెవరో కాదు.. ఆమె పెంచుకుంటున్న కూతురు శీతల్.

Shakeela: షకీలా‌పై దాడి.. పోలీసులను ఆశ్రయించిన నటి.. కూతురే కిరాతకంగా..
Shakeela
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2024 | 9:45 AM

Share

శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు షకీలా. ఆమె తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్న షకీలా ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షకీలా. ఇదిలా ఉంటే షకీలా పై దాడి జరిగిందని తెలుస్తోంది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. షకీలా పై దాడి చేసింది మరెవరో కాదు.. ఆమె పెంచుకుంటున్న కూతురు శీతల్. పెంచుకున్న కూతురే తన పై దాడి చేయడంతో షకీలా ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏంటంటే.

షకీలా చాలా కాలంగా శీతల అనే ఆవిడను పెంచుకుంటున్నారు. కూతురిలా చూసుకుంటున్న ఆమె ఊహించని విధంగా షకీలా పై దాడి చేసింది. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్థలు రావడంతో శీతల్ ఇంటినుంచి వెళ్లిపోయిందని తెలిపారు షకీలా. నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె తన తల్లితో తిరిగి వచ్చిందని.. తాను సర్దిచెప్పే ప్రయత్నం చేయగా తన పై తల్లితో కలిసి దాడి చేసిందని షకీలా పోలీసులకు తెలిపారు.

అంతే కాదు గొడవ జరిగిన సమయంలో అక్కడే ఉన్న లేడీ లాయర్ పై శీతల్ ఆమె తల్లి అసభ్యకరంగా మాట్లాడారని పోలీసులకు తెలిపారు షకీలా. షకీలా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీలా పై ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శీతల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్