
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా కాస్టింగ్ కౌచ్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయట పెట్టారు కూడా.. కొంతమంది దీని పై పోరాటం కూడా చేస్తున్నారు. చాలామంది అందాల ముద్దుగుమ్మలు తాము ఎదుర్కొన్న సమస్యను ధైర్యంగా బయటకు చెప్పుకున్నారు. సినిమా ఆఫర్స్ కోసం చాలా మంది మహిళలు ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. రీసెంట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైగింక వేదింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సిద్ధం కూడా చేసింది. దాంతో కొంతమంది సినీ ప్రముఖులు కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి మాట్లాడుతున్నారు. ఇటీవలే నటి మంచు లక్ష్మీ కూడా దీని పై మాట్లాడారు. తాను కూడా కెరీర్ బిగినింగ్ లో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అని తెలిపింది.
అలాగే తాజాగా ఓ నటి కూడా కాస్టింగ్ కౌచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు ఎక్కువగా టాలీవుడ్ హీరోయిన్స్, హిందీ హీరోయిన్స్ ఎక్కువగా స్పందించారు. తాజాగా కోలీవుడ్ నటి కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది. తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తెలిపింది. ఆమె ఎవరో కాదు సనమ్ శెట్టి. ఈ అమ్మడు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే కోలీవుడ్ లో బిగ్ బాస్ లోనూ నటించింది. తాజాగా సనమ్ శెట్టి మాట్లాడుతూ.. ఓ ఆడపిల్లను తన అనుమతి లేకుండా ముట్టుకున్నా హక్కు ఎవరికీ లేదు అది అందరం గుర్తుంచుకోవాలి. నేను ఓ ఆర్టిస్ట్ ను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం నా పని. అంతే కానీ అమ్ముకోను నేను.. ఆఫర్స్ కోసం శరీరాన్ని అమ్ముకోను అని తెలిపింది సనమ్ శెట్టి. ప్రపంచం మారుతున్నా.. మహిళలు ఎంత ఎదుగుతున్నా.. మహిళలు ఉన్నత చదువులు చదువుతున్నా.. అన్ని రంగాల్లో మహిళల పై వేధింపులు మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ గురించి తెలిసి నేను చాలా షాకయ్యాను. అక్కడ ఏం జరుగుతుందో.. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎవరూ బయట పెట్టడం లేదు. దురదృష్టవశాత్తు నేను కూడా చేదు ఘటనలను ఎదుర్కొన్నాను అని తెలిపింది సోనమ్ శెట్టి. ఇక ఈ అమ్మడు తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. తెలుగులో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సింగం 123 సినిమాలో చేసింది. అలాగే బిగ్ బాస్ మానస్ హీరోగా చేసిన ప్రేమికుడు అనేసినిమాలో చేసింది. వీటితో పాటు మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఈ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.