సంతోషానికి మించి ఏమీ అవ‌సరం లేదంటున్న స‌మీరా రెడ్డి..

బాడీషేమింగ్‌ చేసేవాళ్లను చాలా లైట్ తీసుకోమ‌ని చెబుతున్నారు న‌టి సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించుకుందాం. మనల్ని మనం లైక్ చేద్దాం. ఇత‌రుల‌తో పోల్చుకోవడం మానేద్దాం. ’’ అని కూడా సూచిస్తున్నారు

సంతోషానికి మించి ఏమీ అవ‌సరం లేదంటున్న స‌మీరా రెడ్డి..

Updated on: Jul 24, 2020 | 11:36 PM

బాడీషేమింగ్‌ చేసేవాళ్లను చాలా లైట్ తీసుకోమ‌ని చెబుతున్నారు న‌టి సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించుకుందాం. మనల్ని మనం లైక్ చేద్దాం. ఇత‌రుల‌తో పోల్చుకోవడం మానేద్దాం. ’’ అని కూడా సూచిస్తున్నారు సమీరా. బాడీషేమింగ్‌ గురించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆమె. ఇటీవలే అమ్మ‌ అయిన ఒక యువతి పంపిన మెసేజ్‌ చూసి ఈ విషయం మీద ఈ వీడియో చేసినట్టు పేర్కొన్నారు సమీరా.

వీడియో సారాంశం ఏంటంటే.. ‘‘సమీరా.. ఈ మధ్యనే అమ్మయిన‌ నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే న‌చ్చ‌డం లేదు. చండాలంగా ఉన్నాను అనిపిస్తోంది’ అనే మెసేజ్‌ నాకు వచ్చింది. అది చూశాక‌ నాకు చాలా బాధ క‌లిగింది. మన దగ్గర ఏం లేదో.. దాని గురించే ఎక్కువ‌సార్లు థింక్ చేసి బాధ‌ప‌డ‌టం మానేద్దాం. మన దగ్గర ఉన్నదానితో హ్యాపీగా ఉండ‌టం నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి నన్ను మా సిస్ట‌ర్స్ లేదా ఎవరో ఒకరితోనో పోలుస్తూనే ఉన్నారు. తను అలా ..నువ్వు ఇలా అని. ఇక నేను పని చేసిన ప‌రిశ్ర‌మ ప‌ని కూడా పోల్చి చూడ‌ట‌మే. అందుకే నేను అందంగా క‌నిపించ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాను. మేకప్, ప్యాడ్స్‌, లెన్స్ ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా హ్యాపీగా ఉన్నానా? అంటే లేదు. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యమైన విష‌యం కాదు. హ్యాపీగా ఉన్నామా? లేదా? అన్నదే ఇంపార్టెంట్. చాలా ఏళ్లుగా ఇలాంటి పోలీక‌ల‌తో విసుగెత్తిపోయాను. అందుకే లైట్ తీస‌కుంటున్నాను. మనం సంతోషంగా ఉన్నామా? లేదా అనే విషయం మీదే ఫోక‌స్ పెట్టాను. మీరు కూడా అదే చేయండి.

లావుగా ఉన్నారా నో వ‌ర్రీస్.. స్లోగా త‌గ్గుతారు. వ‌ర్రీ అవ్వ‌కండి.. కుంగిపోకండి. అనవసరమైన విమర్శలతో ఎదిటివాళ్లు కుంగిపోయేలా చేయకండి. హ్యాపీగా ఉండటంపైనే ఫోకస్‌గా ఉండండి. అసంపూర్ణాన్ని కూడా సంపూర్ణం అనుకుని ఆస్వాదిద్దాం. అప్పుడు చాలా హాయిగా ఉంటుంద‌ది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలామందిలో ఆత్మ‌విశ్వాసం నింపేలా ఉన్నాయి.