నిన్న మొన్నటి వరకు అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంది సమంత. మయోసైటీస్ కారణంగా ఏడాది నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. దీనివల్ల ఆరేడు నెలలు ఒప్పుకున్న సినిమాలకు కూడా దూరంగా ఉంది. ఈ ట్రీట్మెంట్ లో భాగంగానే అమెరికా నుంచి వేరే వేరే దేశాలకు ట్రిప్ కూడా వెళ్ళింది. ఆనందంగా ఉంటే అంతకంటే ఆరోగ్యం మరొకటి లేదు అని డాక్టర్లు కూడా చెప్తుంటారు. అందుకే సమంత కూడా తన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇండోనేషియా, యూరప్, ఇటలీ లాంటి దేశాలను చుట్టేసింది సమంత.
అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలు పెడితే సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంది సమంత. అయితే సంవత్సరం పాటు ఈమె సినిమాలు చేయను అని చెప్పింది. అందుకే తీసుకున్న అడ్వాన్సులు కూడా నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు సమంత. ఆమె చేయాల్సిన రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు రష్మిక మందన్న చేస్తుందిప్పుడు. ఈ క్రమంలోనే ముంబైకి వచ్చిన సమంత అక్కడ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తప్ప వేరే ఏది ఒప్పుకోలేదు సామ్. కానీ ముంబైకి వచ్చి రాగానే షూటింగ్ లో ప్రత్యక్షమైంది సమంత. ఈ లెక్కన ఏదైనా యాడ్ షూటింగ్ చేస్తుందేమో అని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.
సమంత లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్..
ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్స్ వెంటనే ఒప్పుకుంటుంది. అయితే తెలుగులో కూడా సినిమాలు చేస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరం నుంచి వచ్చిన శాకుంతలం అంతగా ఆకట్టుకోలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా మాత్రం పర్లేదు అనిపించింది. దీని తర్వాత తెలుగు సినిమా ఏది ఒప్పుకోలేదు సమంత. ప్రస్తుతం మళ్ళీ యాక్టివ్ అవడంతో తెలుగులో సినిమాలు ఒప్పుకుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
సమంత ఇన్‌స్టా పోస్ట్..
కానీ సమంత ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. కేవలం బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితం అవ్వాలని చూస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇదే జరిగితే ఇప్పట్లో మళ్ళీ టాలీవుడ్ లో సమంతను చూడడం జరగని పని. మరోవైపు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేయాలని ఆసక్తి చూపిస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి చూడాలి సమంత ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో..?
మరిన్ని సినిమా వార్తలు చదవండి