స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సమంత తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ అగ్రనటిగ రాణించింది. సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది సామ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కాగా విడాకుల తర్వాత సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే.. సమంత తెలుగు, తమిళం వంటి పాన్ఇండియన్ భాషా చిత్రాలలో నటించి మెప్పించింది. సమంత, నాగ చైతన్యను ప్రేమించి పెళ్లైన విషయం తెలిసిందే.. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. కాగా సినిమాల్లో నటిస్తూనే మాయోసైటిస్కు ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అయితే ఇప్పుడు ఏడాది పాటు సినిమాలకు దూరమై థెరపీపై దృష్టి పెట్టింది.
సమంత ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. రాజ్, డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించింది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలలో నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిరంతరం సినిమాలకు కమిట్ అయ్యి షూటింగ్లో బిజీగా ఉండనుంది సామ్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈరోజు నేను బలంగా ఉన్నానంటే అందుకు కారణం నేను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులే అని సమంత అన్నారు. కారణం ఎవరైనా బాధలు పడుతున్నామని చెబితే అది వారి మేలు కోసమేనని నేను తరచుగా చెబుతుంటాను. కష్టాలు వచ్చినప్పుడే మనుషులు బలవంతులవుతారు. అట్టడుగు స్థాయికి వెళ్లిన తర్వాతే మన బలాలు ఏమిటో తెలుస్తుంది. కష్టాల్లో పీక్స్ చూసిన తర్వాత ఏ పెద్ద సమస్య వచ్చినా కూడా అది సమస్య కాదు. అట్టడుగు స్థాయికి వెళ్లి బాధపడేవారంతా అదృష్టవంతులని సమంత చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.