Samantha Ruth Prabhu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. కారణం ఇదే

|

Jun 09, 2023 | 8:19 AM

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది.

Samantha Ruth Prabhu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. కారణం ఇదే
Samantha
Follow us on

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో సమంత ఒకరు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ అమ్మడి రేంజ్ ను పెంచేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది సామ్. ఇక ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి సినిమా చేస్తోంది. సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది.సిటాడెల్’ భారతీయ వెర్షన్ మెజారటీ భాగం చిత్రీకరణ పూర్తయింది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే వరుణ్ ధావన్ , సమంత రాష్ట్రపతిని కలిశారు. సమంత, వరుణ్ సెర్బియా లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప ఆనందాన్ని గౌరవాన్ని ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు వరుణ్.