Samantha : ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు..

టాలీవుడ్ సమంత జీవితంలో కొత్త అధ్యయనం మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం.

Samantha : ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు..
Samantha Wedding

Updated on: Dec 01, 2025 | 1:07 PM

సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వేడుక కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. తన పెళ్లికి సామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లుగా టాక్.

గత రెండు రోజులుగా సమంత, రాజ్ నిడమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నిడమోరు మాజీ భార్య శ్యామలి దే చేసిన ఇన్ స్టా పోస్ట్ సైతం ఈ వార్తలకు బలం చేకూర్చింది. “తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని” పోస్ట్ చేశారు.

రాజ్‌ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్‌ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలోనే షామాలీ డేని వివాహం చేసుకున్నారు రాజ్‌. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

‘ఏమాయ చేసావె’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?