
నో మీన్స్ నో.. వద్దంటే వద్దంతే.. సినిమాల విషయంలో ఇంత ఖరాకండిగా ఉండే హీరోయిన్లు ఎంతమంది ఉంటారు చెప్పండి..? రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నారనో.. పెద్ద హీరో ఉన్నారనో.. ఎక్కడో ఓ చోట మొహమాటానికి పోయి ఓకే చెప్తుంటారు.. తర్వాత బాధ పడుతుంటారు. కానీ హమ్ అలగ్ అంటూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి. ఈమె అజ్ఞావతాసం ఇంకా ఎన్నాళ్లు..? సాయి పల్లవి కాదన్న సినిమాల పరిస్థితేంటో తెలుసా..? సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండటం ఎంతసేపు..? ఎప్పుడైనా ఉండొచ్చు.. ఎవరైనా ఉండొచ్చు.. కానీ ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కూడా ట్రెండింగ్‌లో ఉండటం అంటే మాత్రం అక్కడున్నది సాయి పల్లవి అని అర్థం చేసుకోవాలేమో..? బిల్డప్ కాస్త ఓవర్ అనిపించినా జరుగుతున్నదిదే.
సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నారీ భామ. హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి సాధ్యమైంది. విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్ట్స్ లెవల్ అంతే. తర్వాతి సినిమా ఎప్పుడు మేడమ్ అంటే.. మంచి కథ రావాలి కదండీ.. అది లేకపోతే నేనెలా సినిమా చేస్తానటున్నారీమే. ఆ కథ వచ్చేవరకు ఖాళీగా ఉంటాను కానీ కాసుల కోసం సినిమాలు చేయనంటున్నారు. అలా సాయి పల్లవి వదిలేసిన భోళా శంకర్, డియర్ కామ్రేడ్ రిజల్ట్స్ ఏంటో అందరికీ తెలుసు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.