Sai Pallavi: ‘అంత సీన్ లేదండి.. నేను చాలా లక్కీ’.. విరాటపర్వం ప్రమోషనల్ వీడియోపై సాయి పల్లవి రియాక్షన్..

|

Jun 05, 2022 | 9:15 AM

నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది.

Sai Pallavi: అంత సీన్ లేదండి.. నేను చాలా లక్కీ.. విరాటపర్వం ప్రమోషనల్ వీడియోపై సాయి పల్లవి రియాక్షన్..
Sai Pallavi
Follow us on

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం విరాటపర్వం (Virata Parvam). డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో హీరో రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లను షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ట్విట్టర్ వేదికంగా కాస్త డిఫరెంట్‏గా ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆవీడియో చూసిన సాయిపల్లవి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

ఆ వీడియోలో 30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్.. ఓ అభిమానిగా రానా ఆఫీస్ వద్దకు వెళ్లి హంగామా చేస్తాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ.. ప్రమోషన్స్ ఏవీ అంటూ హంగామా చేస్తాడు. దీంతో రానా తన ఆఫీస్ నుంచి బయటకు వస్తాడు.. తాను సాయి పల్లవి చూడానికి వెయిటింగ్ అని.. తను ఆ హీరోయిన్ అభిమానినని చెప్తాడు.. అందుకు రానా బదులిస్తూ.. తాను కూడా సాయి పల్లవి అభిమానినని.. అసలు ఆమె కోసమే ఈ సినిమా తీశామని చెప్తాడు.. ఆమె ఫ్యాన్స్ కోసం కర్నూలులో జూన్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్తాడు.. ఆ వేడుకకు సాయి పల్లవి కూడా వస్తుందని తెలిపాడు.. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు మేకర్స్. ఈ ప్రమోషనల్ వీడియో చూసిన సాయి పల్లవి ఇక్కడ అంత సీన్ లేదండి అంటూ రిప్లై ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

“ఇక్కడ అంత సీన్ లేదండి. ప్రజల ప్రేమను పొందుతోన్న నేనే చాలా అదృష్టవంతురాలిని. కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నాను ” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. 1990 సమయంలో తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

ట్వీట్..