
నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా నటించి మెప్పిస్తుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ లో నటించి మెప్పించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తెలుగమ్మాయిగా మారిపోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పేద ప్రజలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అని తెలిపింది సాయి పల్లవి.
సాయి పల్లవి తెలుగులో వరుసగా హిట్స్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది . సాయి పల్లవి మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మాదగ్గర అంతగా డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అని నటి సాయి పల్లవితెలిపింది.
కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య మత్యకారుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతుంది. అలాగే తమిళ్ లోనూ ఓ బడా సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.