
ఆమె ఓ యంగ్ హీరోయిన్.. తన గ్లామర్‌తో కుర్రాళ్లను కట్టుపడేసింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు… మల్టీ టాలెంటడ్. ఈ ముద్దుగుమ్మ మార్షల్ ఆర్ట్స్ లో తోపు ఆమె.. అలాగే బాక్సింగ్ లోనూ నైపుణ్యంలో టాప్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దమ్ముంటే నాకు సైట్ కొట్టండి చూద్దాం అని ఛాలెంజ్ చేస్తుంది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు రితిక సింగ్.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
తమిళ్ ఇండస్ట్రీలో ఒకొక్కనటుడు ఒకొక్క మానవత్వంతో ఉంటారు. వారితో నటించిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో నుంచి ఒకరిని ఎంచుకోవాలి అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అనే చెప్తాను. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా .. ఇతరుల పై ఆయన చూపించే ప్రేమాభిమానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అని చెప్పుకొచ్చింది. అలాగే మహిళలపై జరిగే అత్యాచారాలు తెలిస్తే నాలో కోపం కట్టలు తెంచుకుంటుందని చెప్పింది. మీకు ఎవరైనా సైట్ కొడితే మీరు ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు.. కొంచెం పక్కకు రమ్మంటానని, ధైర్యం ఉంటే అలాంటోడిని రమ్మనండి చూద్దాం అని సవాల్ చేసింది రితికా సింగ్. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.