Renu Desai: ‘ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను’.. రేణూ దేశాయ్ ఇన్ స్టా పోస్ట్ వైరల్.. కామెంట్ సెక్షన్ క్లోజ్..

ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తండ్రిపై ఓ కొడుకు ప్రేమ మరీ ఈ రేంజ్‏లో...అంత వయోలెన్స్‏గా ఉంటుందా అన్న రేంజ్‏లో సినిమాను తెరకెక్కించాడు సందీప్. ప్రేమకథ..తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీతారలు ప్రశంసలు కురిపిస్తూ రివ్యూస్ ఇచ్చేశారు. ఇక ఇందులో రణబీర్, రష్మిక నటనను తెగ మెచ్చుకుంటున్నారు అడియన్స్.

Renu Desai: ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను.. రేణూ దేశాయ్ ఇన్ స్టా పోస్ట్ వైరల్.. కామెంట్ సెక్షన్ క్లోజ్..
Renu Desai

Updated on: Dec 06, 2023 | 6:11 PM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్‏గా క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పుడు మాస్ యాక్షన్‏తో అదరగొట్టేశాడు. ‘యానిమల్’ సినిమాతో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్‏లో ప్రేక్షకులకు మరో రణబీర్ పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తండ్రిపై ఓ కొడుకు ప్రేమ మరీ ఈ రేంజ్‏లో…అంత వయోలెన్స్‏గా ఉంటుందా అన్న రేంజ్‏లో సినిమాను తెరకెక్కించాడు సందీప్. ప్రేమకథ..తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీతారలు ప్రశంసలు కురిపిస్తూ రివ్యూస్ ఇచ్చేశారు. ఇక ఇందులో రణబీర్, రష్మిక నటనను తెగ మెచ్చుకుంటున్నారు అడియన్స్. తాజాగా యానిమల్ సినిమాపై ఆసక్తికర పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్ తనకు చాలా నచ్చయని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

“ఎట్టకేలకు నిన్న యానిమల్ సినిమమా చూశాను. నిస్సందేహంగా ఈసినిమాతో ప్రేమలో పడ్డాను. ఈ సినిమా బలహీనమైన గుండె ఉన్నవాళ్ల కోసం మాత్రం కాదు. ఇందులో బ్లడీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మీరు ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ మూవీలో కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే” అంటూ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది రేణూ దేశాయ్. దీంతో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అంతకు ముందు యానిమల్ సినిమాపై హీరోయిన్ త్రిష సైతం పొగడ్తలు కురిపించింది. ఈ మూవీ నిజంగా కల్ట్ మూవీ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ఆమెను ట్రోల్ చేశారు నెటిజన్స్. ఈ సినిమాలో స్త్రీని తక్కువ చేసి చూపించే ఇలాంటి చిత్రాలను మెచ్చుకుంటున్నావ్. మరీ మన్సూర్ అలీఖాన్ మాట్లాడితే ఎందుకు వ్యతిరేకించావ్ అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో తన ఇన్ స్టాలో యానిమల్ పోస్ట్ డెలిట్ చేసింది.


ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈసినిమాకు తెలుగు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో గీతాంజలి పాత్రలో రష్మిక నటన బాగుందని.. ఆమె మరెన్నో విజయాలను అందుకోవాలని అన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటివరకు యానిమల్ సినిమా రూ. 425 కోట్లకు పైగా రాబట్టింది. అలాగే ఈ సినిమాలోని ప్రతి సాంగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.