
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ప్రస్తుతం చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇటీవలే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పలో శ్రీవల్లి పాత్రలో నటించి అదరగొట్టింది. అలాగే టాలెంటెడ్ హీరో శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో సూపర్ హిట్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ నేషనల్ క్రష్.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన రష్మిక నటించనుంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారిగా దుల్కర్ సల్మాన్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ముందునుంచి వినిపిస్తున్న టాక్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా ఎంపికైంది. ఇందులో ఆమె కశ్మీరీ ముస్లిం అమ్మాయి ఆఫ్రిన్ పాత్రలో కనిపించనుందని మేకర్స్ ప్రకటించారు. ఈరోజు రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆఫ్రిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
Also Read: Ram Charan: రామ్‌చరణ్ – శంకర్ సినిమా నుంచి ఫోటో లీక్.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్..
Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్ వీడియో.. వరుణ్ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ
OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..