ఏఎన్నార్ చనిపోయినపుడు ఆ హీరోయిన్ నన్ను తోసేసింది.. చాలా మంది అవమానించారు

ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రమాప్రభ. వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమా ప్రభ. వయో భారంతో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. రమాప్రభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఏఎన్నార్ చనిపోయినపుడు ఆ హీరోయిన్ నన్ను తోసేసింది.. చాలా మంది అవమానించారు
Rama Prabha

Updated on: Jun 08, 2026 | 8:30 PM

నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో మెప్పించి అలరించారు రమా ప్రభ. ప్రస్తుతం ఆమె వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివంగత అక్కినేని నాగేశ్వరరావు మరణం సందర్భంలో తనకెదురైన భావోద్వేగ, కొన్ని అనూహ్య సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏఎన్నార్‌తో తనకు కేవలం స్నేహం కాదని, అది ఒక బలమైన ఆత్మ సంబంధమని ఆమె వివరించారు. ఏఎన్నార్ మరణించిన రోజుకు ముందు రోజు, అంటే జనవరి 21వ తేదీన, రమాప్రభ ఆరోగ్యం బాగాలేక సెలైన్ ఎక్కించుకున్నా.. అదే రోజు, ఒక చిన్న కంపెనీ నుంచి డబ్బింగ్ కోసం పిలుపు వచ్చింది. ఆ డబ్బింగ్ కోసం ఆమెకు రూ. 10,000తో పాటు ఓపెన్ రిటర్న్ టికెట్ ఇచ్చి, మరుసటి రోజు ఉదయం రావాల్సిందిగా కోరారు. రాత్రి 2 గంటలకు ఆమె రైలు ఎక్కారు. తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకొని గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తర్వాత, టీవీలో ఏఎన్నార్ మరణవార్త చూసి షాక్‌కు గురయ్యారు. తనకు ఏడుపు రాలేదని, అది “బ్లాంక్” అనుభూతి అని ఆమె చెప్పారు.

ఉదయం 6:30-7 గంటల సమయంలో నటి వాణిశ్రీ నుండి ఫోన్ వచ్చింది. “ఏమే నువ్వు ఎక్కడున్నావు? ఇలా అయింది అంటా” అని అడగ్గా, “వాణి నేను ఇప్పుడే చూశాను” అని రమాప్రభ బదులిచ్చారు. అప్పుడు వాణిశ్రీ “నువ్వు రెడీగా ఉండు, వచ్చి పికప్ చేస్తాను” అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఏఎన్నార్‌కు సంబంధించిన కొందరు వ్యక్తులు తనను “లోపలికి రాకూడదు” అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, అనూహ్యంగా ఒక ఆర్టిస్ట్ పరిగెత్తుకు వచ్చి తనను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారని రమాప్రభ గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనలన్నీ ప్రకృతి ఏదో ఒక కారణంతో ఆత్మలను రప్పిస్తుందనే తన నమ్మకాన్ని బలపరిచాయని ఆమె అన్నారు.

అక్కడ కూర్చున్నప్పుడు, కొందరు పెద్ద హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు తనను అవమానించినట్లు ఆమె చెప్పారు. ఒక ప్రముఖ హీరోయిన్ తనను తోసివేసిన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. “నేనేమీ మాట్లాడలే. సైలెంట్‌గా ఉన్నా,” అని ఆమె అన్నారు. ఈ కష్ట సమయంలో టబు, అనుష్క వంటి నటీమణులు తన వద్దకు వచ్చి పట్టుకున్నారని తెలిపారు. ఏఎన్నార్ భౌతిక కాయాన్ని అరుగు మీద ఉంచగా, కుటుంబ సభ్యులు దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏఎన్నార్ ముఖం చూసినప్పుడు, 50-55 ఏళ్ళలో తాను అంత అందంగా ఎవరి ముఖాన్ని చూడలేదని రమాప్రభ ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలోనాగార్జునను పట్టుకొని ఏడుస్తున్నట్లు నటించడం, పక్కకు చూసి కన్ను కొట్టడం తాను చూశానని, అలాంటివి ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us