ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఉన్న టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు (Rakul Preet Singh). అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాలీవుడ్ అగ్రకథానాయికగా కొనసాగుతుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రకుల్. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు వరుస చిత్రాలతో బీటౌన్లో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది ఈ హీరోయిన్. అయితే ఇప్పుడు తనకు వెబ్ సిరీస్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది రకుల్.
ప్రస్తుతం ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. సరికొత్త కంటెంట్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, టాక్ షోస్, గేమ్ షోస్ లతో ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక ఇప్పటికే పలువురు స్టార్ హీరోహీరోయిన్స్ డిజిటల్ ప్లాట్ ఫాంపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వలన ఇలాంటి కథలకు మరింత ఆదరణ పెరిగింది. కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాల విడుదలలు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వలన మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు గుర్తింపు వస్తుంది. పాన్ ఇండియన్ సినిమా మార్కెట్ విషయంలో బాహుబలి అన్ని కోణాల్లోనూ కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషాపరమైన హద్దులు చెరిగిపోయాయి. డిజిటల్ ప్లాట్ ఫాంలో లేదా వెబ్ సిరీస్ లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ కథ నన్ను ఎగ్జైట్ చేయడంతో నా పాత్రను కథను నడిపించేలా ఉండాలి” అని చెప్పుకొచ్చారు రకుల్.
Also Read: Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్
Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..
Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?