AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్‌ సోదరుడు..

సైబరాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో నలుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈకేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ సోదరుడు అమన్‌సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Rakul Preet Singh: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్‌ సోదరుడు..
Aman Singh
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2024 | 4:07 PM

Share

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయిని పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకువస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లు గప్పి యువతకు, వ్యాపారస్తులకు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నలుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. ఇందులో సినీరంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే.

చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న రకుల్.. ఇటీవలే ఇండియన్ 2 సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. కమల్ హాసన్ నటించిన ఈ మూవీ జూలై 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్