అలాంటి బట్టలువేసుకొని ఫైట్ చేయమన్నారు.. నచ్చక పోయినా ఆ సీన్ చేశా..!

వెండితెరపై ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోయే అరుదైన నటీమణుల్లో రాధికా ఆప్టే ఒకరు. ప్రయోగాత్మక కథలు, వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. బాలీవుడ్‌తో పాటు ఓటీటీలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అలాంటి బట్టలువేసుకొని ఫైట్ చేయమన్నారు.. నచ్చక పోయినా ఆ సీన్ చేశా..!
Actress

Updated on: Sep 20, 2026 | 5:11 PM

తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో నటించిన రాధిక.. తాజాగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెరీర్ ప్రారంభ దశలో కథ, పాత్ర డిమాండ్ మేరకు తాను కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని రాధికా ఆప్టే తెలిపారు. అయితే అలాంటి పాత్రల్లో కనిపించిన కారణంగా కొంతమంది తనపై ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఒకసారి బోల్డ్ సన్నివేశంలో నటించినంత మాత్రాన.. ఇక ఎలాంటి సన్నివేశం ఇచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉంటారనే భావన కొందరిలో ఏర్పడటం తనను అసంతృప్తికి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. నటిగా తన ప్రయాణంలో తన ఆలోచనా విధానం కూడా మారిందని, ఇప్పుడు కథకు లేదా పాత్రకు అవసరం లేని సన్నివేశాలు చేయడానికి తాను అంగీకరించనని స్పష్టం చేశారు.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

బోల్డ్ సన్నివేశాల విషయంలో కొందరు మేకర్స్ వ్యవహరించే తీరుపైనా రాధిక స్పందించారు. ఒక సన్నివేశం కథలో ఎందుకు అవసరమో, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో నటీనటులకు స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కొందరు దర్శకులు, నిర్మాతలు మాత్రం ఇలాంటి సన్నివేశాలను చాలా తేలికగా తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ‘ఇది 15 సెకన్ల కిస్ సీన్ మాత్రమే.. చేసేయండి’ అనే తరహాలో మాట్లాడటం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. ఒక నటికి సంబంధించిన సన్నివేశాన్ని కేవలం కొన్ని సెకన్ల వ్యవధితో కొలవడం సరైన విధానం కాదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా రాధికా ఆప్టే గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

ఓ భారీ చిత్రంలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో తన దుస్తులకు సంబంధించి కొందరు చేసిన సూచనలను ఆమె తిరస్కరించినట్లు తెలిపారు. ఫైట్ సీన్‌లో షర్ట్ బటన్లు పూర్తిగా విప్పి నటించమని తనను అడిగారని, యాక్షన్ సన్నివేశంలో వేగంగా కదలాల్సి ఉండటంతో తాను అందుకు అంగీకరించలేదని ఆమె వివరించారు. ఆ తర్వాత కనీసం మరింత తక్కువ దుస్తులతో అయినా సన్నివేశాన్ని పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారని రాధిక పేర్కొన్నారు. అలాంటి దుస్తులు యాక్షన్ సన్నివేశానికి ఎందుకు అవసరం.? దాని ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి భావనను అందించాలనుకుంటున్నారు? అంటూ తాను ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. చివరకు తనకు నచ్చని విధంగా ఆ సన్నివేశంలో నటించేందుకు అంగీకరించలేదని వెల్లడించారు. తనను ఆ విధంగా నటించమని కోరిన వ్యక్తి పేరు బయటపెడితే సినీ పరిశ్రమలో చాలామంది ఆశ్చర్యపోతారని రాధిక అన్నారు. ఆయనకు పరిశ్రమలో మంచి పేరు, ఉన్నత స్థాయి ఉందని పేర్కొంటూ.. వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశం కాదనే విషయాన్ని కూడా తెలిపారు రాధికా.

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us