Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

సాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావడం.. నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంటే అమ్మాయిలకు అంత సులభం కాదు. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటారు. అలాగే చాలా మంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.

Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
Radhika

Updated on: Dec 21, 2025 | 6:42 PM

భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రాధిక ఆప్టే. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనదైన నటనతో కట్టిపడేసింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. కొన్నాళ్ల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రాధిక.. సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే ఆమె కథానాయికగా నటించిన సాలి మొహబ్బత్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక.. తన కెరీర్ మొదట్లో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…

సౌత్ ఇండస్ట్రీలో ఓ సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమని చెప్పారని తెలిపింది. ఎక్కువగా కనిపించేలా చేయాలని .. అందుకే ప్యాడింగ్ చేసుకోమన్నారని.. అప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది. “సౌత్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. నేను దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేశాను. ఆ మూవీ షూటింగ్ సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆ మూవీ షూటింగ్ సెట్ లో నేను ఒక్క అమ్మాయినే ఉన్నాను. బ్రెస్ట్ పెద్దగా కనిపించేందుకు ప్యాడింగ్ చేయాలని అన్నారు. తప్పక ఒప్పుకున్నాను. అయినా ఇంకా ప్యాడింగ్ చేయాలని అన్నారు. వెంటనే నేను కుదరదు అని చెప్పాను. అప్పుడు నాకు మేనేజర్ లేడు. ఒక్కదాన్నే అమ్మాయిని” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..

రాధిక ఆప్టే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆమె పలు చిత్రాల్లో నటించింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. అలాగే తన శరీరం, బరువు హెచ్చుతగ్గులు, ఇండస్ట్రీలో ఒత్తిళ్ల గురించి అనేక విషయాలు బయటపెట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..

Radhika Apte

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..