నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి, బండ బూతులు తిడుతూ..

|

Aug 24, 2024 | 4:42 PM

తమ అభిమాన హీరోయిన్ ను దగ్గర నుంచి చూడాలని కుదిరితే సెల్ఫీ దిగాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు హద్దు మీరుతూ ఉంటారు కూడా.. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ పై దాడి చేశాడు. ఆమె ప్రయాణిస్తున్న కారు పై దాడి చేశాడు. దాంతో బెదిరిపోయిన ఆమె బోరున కన్నీళ్లు పెట్టుకుంది. భయంతో బిక్కు బిక్కుమంటూ ఓ వీడియో షేర్ చేసింది. 

నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి, బండ బూతులు తిడుతూ..
Actress
Follow us on

సినిమా తారలు కనిపిస్తే అభిమానులు ఎగబడి ఫోటోలు తీసుకుంటుంటారు. తమ అభిమాన హీరోయిన్ ను దగ్గర నుంచి చూడాలని కుదిరితే సెల్ఫీ దిగాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు హద్దు మీరుతూ ఉంటారు కూడా.. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ పై దాడి చేశాడు. ఆమె ప్రయాణిస్తున్న కారు పై దాడి చేశాడు. దాంతో బెదిరిపోయిన ఆమె బోరున కన్నీళ్లు పెట్టుకుంది. భయంతో బిక్కు బిక్కుమంటూ ఓ వీడియో షేర్ చేసింది. రద్దీగా ఉండే రోడ్డు పైనే ఇలా తన పై దాడి జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. బెంగాల్ లో జన్మించిన నటి పాయల్ ముఖర్జీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. తెలుగులో ఈ అమ్మడు శ్రీరంగాపురం అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు రోడ్డు పై కారులో వెళ్తుంటే అనూహ్య బైక్ రైడర్ ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో లైవ్ రికార్డ్ కూడా చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత పాయల్ ఏడుస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. పాయల్ తెలిపిన వివరాల ప్రకారం, కోల్‌కతా నగరంలో తన ఎస్‌యూవీలో వెళుతుండగా, బైక్ పై ఓ  వ్యక్తి ఆమె కారు వెనుక నుంచి వచ్చాడు. వచ్చి ఆమెను కారు ఆపమని అన్నాడట. ఆమె కారు ఆపకపోవడంతో.. హెల్మెట్‌తో పాయల్‌ కారు అద్దాన్ని పగలగొట్టి, కారులోపలికి పౌడర్‌ విసిరాడట. ఆ తర్వాత కూడా తనను బలవంతంగా కారు దిగామని.. అనరాని మాటలతో తిట్టాడని చెప్పుకొచ్చింది పాయల్.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

దాంతో ఒక్కసారిగా షాక్ అయిన పాయల్ పోలీసులకు ఫోన్ చేసింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునిఆమెను తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత పాయల్ ఒక వీడియోలో మాట్లాడుతూ, ‘ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మహిళపై క్రూరంగా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటామో ఆలోచించండి. మహిళల భద్రత గురించి మాట్లాడుతున్న సమయంలో అలాంటి ఘటన జరిగింది. ఆగస్టు 09న కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసును ఖండిస్తూ పాయల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ కారణంగానే పాయల్ పై దాడి జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పాయల్ ముఖర్జీ. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.