పాయల్ గోష్.. ఈ అమ్మడు చాలా మందికిపెద్దగా తెలియక పోవచ్చు. మనదగ్గర హీరోయిన్ గాను చేసింది ఈ చిన్నది. మంచు మనోజ్ నటించిన ప్రయాణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది పాయల్ గోష్. అంతకన్నా ముందు ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించింది. ఇక ప్రయాణం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత కన్నడలో ఓ సినిమాలో నటించింది. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ గోష్. ఆతర్వాత బాలీవుడ్ లో వెళ్ళింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ పై వీలు దొరికినప్పుడల్లా షాకింగ్ కామెంట్స్ చేస్తూనే ఉంది.
ఆమధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ తెగ హడావిడి చేసింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించాడు అంటూ కామెంట్స్ చేసింది పాయల్. అలాగే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ పై కామెంట్స్ చేసింది. నేను లక్కీగా సౌత్ సినిమాలనుంచి ఎంట్రీ ఇచ్చాను. అదే బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి ఉంటే నా బట్టలు ఊడదీసేవారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Is #oosaravelli on @PrimeVideoIN , my all other films are on every big OTT platforms, than Netflix, wish to be there very very soon 🖤 pic.twitter.com/HxkaqGWmB1
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023
బాలీవుడ్ నుంచి నేను ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు తొలగించేవారు. ఇక్కడి వారికి టాలెంట్ తో పనిలేదు. బట్టలు ఊడదీస్తే చాలు అంటూ సంచలన కామెంట్స్ చేసింది పాయల్ గోష్. బట్టలు తీసేసే వాటితో వ్యాపారం చేసేవారు.. వీరికి టాలెంట్ తో పనిలేదు.. అమ్మాయిలు బట్టలు తీసేస్తే చాలు అని కామెంట్స్ చేసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
Early morning bath is more refreshing ☺️ pic.twitter.com/bFQKz6VIBv
— Payal Ghoshॐ (@iampayalghosh) October 3, 2023
Pls… pls our film should be on @NetflixIndia please do something about it @tarak9999 🥰 #osaravalli pic.twitter.com/wHhJFx6gz1
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.