‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ వల్ల షాపింగ్ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా షాపింగ్ చేసేయాలనుంది’’ అని ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధీ అగర్వాల్ అంటోంది. కరోనా కారణంగా ఏడాది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యామని తెలిపింది. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్ చేయడం మిస్ అయ్యా. అందుకే ఈ ఇయర్ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్ చేయడం ఇష్టం.
ఆన్‌లైన్ షాపింగ్ చేసీ చేసీ బోర్ కొట్టేసిందని నిధీ అగర్వాల్ అంది. స్టోర్స్ అన్నీ ఓపెన్ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించిందని బహిరంగంగా తనకున్న ఇష్టాన్ని నిధీ తెలుపుతోంది. లాక్‌డౌన్ ముగియడంతో ఇప్పుడు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నా అని అన్నారు. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు.
Also Read:
Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..