
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో నేహాశెట్టికి మంచి క్రేజ్ వచ్చేసింది. డీజే టిల్లు సినిమాతో ఈ అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి గ్లామర్ పరంగా మరింతగా ఫేమస్ అయ్యింది.దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు నేహా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే కార్తికేయ సరసన బెదురులంక 2012 చిత్రంలో నటించింది. ఈ సినిమా డీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి తన గ్లామర్ తో హైలెట్ అయ్యింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్. నిత్యం తన లేటేస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంది. తాజాగా బ్లూ శారీలో కనిపించిన విధానం నెట్టింట వైరలవుతుంది.
బ్లూ చీరలో అందాల ఫోటోషూట్స్ చేసింది నేహా. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరలవుతున్నాయి.
అంతకు ముందు యూట్యూబర్ శ్వేత నాయుడుతో కలిసి రూల్స్ రంజాన్ సినిమాలోని సమ్మోహనుడా పాటకు అందంగా డాన్స్ చేసి కట్టిపడేసింది నేహా శెట్టి. ఈ పాటలో పింక్ చీరలో మరోసారి గ్లామర్ తో హైలెట్ అయ్యింది.
ప్రముఖ డిజైనర్ geishadesigns రెడీ చేసిన వైట్ శారీలో జాబిలమ్మగా మెరిసిపోయింది నేహా. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఎవరి దిష్టి తగలకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఎల్లో శారీలో సంప్రదాయ లుక్ లో కట్టిపడేసింది నేహాశెట్టి. కొప్పులో మల్లెపూలు.. ముత్యాలతో కూడిన జ్యూవెల్లరీ ధరించి అచ్చ తెలుగమ్మాయిలా ట్రెడిషనల్ గా కనిపించింది.
సినిమా ప్రమోషన్లకు.. పలు ఈవెంట్లకు చీరకట్టులో సంప్రదాయ లుక్ లో పాల్గొంటుంది నేహాశెట్టి. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.