అందంలో ఎల్లోరా శిల్పం ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లలో తెగ ఫాలోయింగ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా ?

|

Jan 29, 2022 | 9:24 AM

ప్రస్తుతం దేశంలో కరోనా మహామ్మారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

అందంలో ఎల్లోరా శిల్పం ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లలో తెగ ఫాలోయింగ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా ?
Actress
Follow us on

ప్రస్తుతం దేశంలో కరోనా మహామ్మారి విలయతాండవం చేస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాయి. నైట్ కర్య్ఫూ, లాక్ డౌన్ వంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శానిటైజర్.. మాస్క్ తప్పనిసరిగా వెంటబెట్టుకోవాలని.. మాస్క్ ధరించకుండా బయట తిరిగితే జరిమానా చెల్లించాలంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు.

అయితే ఈ మాస్క్ ధరించడం వలన మనకు తెలిసిన వ్యక్తులు సైతం అపరిచితులుగా మారిపోతున్నారు. మాస్క్ వెనకాల ఉన్నవారిని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిపోయింది. దీంతో సెలబ్రెటీలను సైతం గుర్తుపట్టడం వీలు కావడం లేదు. నిజమే.. మరీ.. పైన మాస్క్.. గ్లాసెస్ ధరించిన ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి..

ఈ హీరోయిన్‏కు దక్షిణాది చిత్రపరిశ్రమలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ ఈ అమ్మడుకు క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఓ స్టార్ హీరోను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది ఈ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. కాస్త కష్టంగానే ఉంది కదు..

ఆమె మరెవరో కాదండోయ్… మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నజ్రియా. అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. మలయాళి స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‏ను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తుంది. ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..