Meera Jasmine: అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా..! అసలు విషయం చెప్పిన మీరాజాస్మిన్

గ్లామర్ తో కూడా అవకాశాలు అందుకోవచ్చని ఈ అమ్మడు కాస్త ఆలస్యంగా తెలుసుకుంది. ఇప్పుడు లెట్ వయసులో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది మీరాజాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ.

Meera Jasmine: అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా..! అసలు విషయం చెప్పిన మీరాజాస్మిన్
Meera Jasmine

Updated on: Jul 10, 2023 | 8:51 AM

ఒకప్పుడు పద్దతిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి సోషల్ మీడియాలో మాత్రం తమ గ్రామర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు కొంతమంది భామలు. అలాంటి వారిలో మీరాజాస్మిన్ ఒకరు. గ్లామర్ తో కూడా అవకాశాలు అందుకోవచ్చని ఈ అమ్మడు కాస్త ఆలస్యంగా తెలుసుకుంది. ఇప్పుడు లెట్ వయసులో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది మీరాజాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. మీరాజాస్మిన్ ఏంటి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటున్నారు ఈ అమ్మడు ఫోటోలు చూసిన నెటిజన్లు. రోజు రోజుకు  వయ్యారాలు ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఆమె విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఎయిర్ హోస్ట్రర్ గా కనిపించింది మీరాజాస్మిన్. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలిపింది. హీరోయిన్ గా రాణించినందుకు గర్వంగా ఉంది. ఇంకా మెరుగ్గా సినిమాల్లో నటించడానికి, రాణించడానికి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా అని తెలిపింది మీరా. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంటే నాకు కొత్తగా ప్రయాణం మొదలు పెట్టిన ఫీల్ కలుగుతుంది  అని తెలిపింది మీరాజాస్మిన్