
హీరోయిన్ మీనా.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన మీనా.. ఆ తర్వాత కథానాయికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస సినిమాలతో అలరించింది. అగ్ర హీరోలందరితో కలిసి నటించిన మీనా.. ప్రతిసారి తన సినిమా ఎంపిక విషయంలో ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. సీనియర్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబీ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
మీనా మాట్లాడుతూ.. మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి నటించిన హరికృష్ణన్స్, కమల్, శివాజీ గణేష్ ల తేవర్ మగన్, క్షత్రియ పుత్రుడు, రజినీకాంత్ నటించిన పడయప్ప.. (తెలుగులో నరసింహా) సినిమాల్లో తాను నటించాల్సిందని.. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఈ ఆఫర్స్ తిరస్కరించాల్సి వచ్చిందని అన్నారు. చాలా సినిమాలు ఇలాగే డేట్స్ కుదరక పోగొట్టుకున్నానని.. మంచి మూవీస్ మిస్ చేసుకున్నానే అని ఫీలయ్యేదాన్ని అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
అలాగే బ్రో డాడీ సినిమా తనకు ఆఫర్ చేశారని.. అందులో పాత్ర గురించి ఆరా తీస్తే.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లిగా కనిపించాలని చెప్పారు. దీంతో వెంటనే షాకయ్యాను. ఎందుకంటే ఆ హీరో కేవలం నాకంటే ఆరేళ్లు మాత్రమే చిన్నవాడు. అలాంటిది అతడికి తల్లిగా నటించడం కష్టమని చెప్పాను. తర్వాత నాకు నచ్చజెప్పడంతో కథ బాగుండడంతో ఒప్పుకుని నటించాను. సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్ర పై ప్రశంసలు వచ్చాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నిబద్ధత, అంకితభావం.. అతడిని గొప్ప నటుడిగా చేశాయి అని చెప్పుకోవాలి అని అన్నారు మీనా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..