
మలయాళ హీరోయిన్ మమితా బైజుకు తెలుగు నాట కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఆమె పెట్టే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. ‘ప్రేమలు’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించింది. ‘డ్యూడ్’, ‘జన నాయగన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అంటూ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ అందాల తార. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ సినీ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. మరో నాలుగు రోజుల్లో సినిమా కూడా రిలీజ్ (ఆగస్టు 14) కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది మమితా బైజు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంటున్నారు. కాగా ఇదే సందర్భంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది మమిత. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని అభిమానులకు షాక్ ఇచ్చింది.
‘ సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్‌ను కూడా వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని చెప్పుకొచ్చింది మమిత. దీంతో ఈ అమ్మడి నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక గా మారింది. ఉన్నట్లుండి మమిత ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటబ్బా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
కాగా ఇంటర్వ్యూల్లో భాగంగా తన అభిమాన హీరో గురించి మాట్లాడింది మమిత. ‘నేు అల్లు అర్జున్‌కు వీరాభిమానిని. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో బన్నీ ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్‌ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేస్తుంటాను’ అని తెలిపింది మమిత.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.