Tollywood: ఈ చెప్పుల వెనుక ఉన్న అద్భుతమైన జ్ఞాపకం.. 2008 నుంచి 2022 వరకు..

చెప్పుల గురించి కూడా పోస్టా అని మీరు నొసలు విరువవచ్చు. కానీ ఓ తెలుగమ్మాయి మధురమైన జ్ఞాపకం వెనుక ఉన్న అద్బుతమైన విషయాలను అందించేందుకు మేం ఏ మాత్రం వెనకాడం.

Tollywood: ఈ చెప్పుల వెనుక ఉన్న అద్భుతమైన జ్ఞాపకం.. 2008 నుంచి 2022 వరకు..
Old Chappal

Updated on: Nov 16, 2022 | 9:12 PM

మన అమ్మాయి.. మన మాధవీ లత.. నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. 2008లో ఈ సినిమా రిలీజై మంచి హిట్టైయ్యింది. తను చాలా క్యూట్.. ఇప్పటికీ కూడా వన్నె తగ్గని అందం. ఆమె మాట్లాడుతుంటే అలా చూడాలనిపిస్తుంది.. వినాలనిపిస్తుంది. కానీ ఈ పిల్లకు సరైన అవకాశాలు రాలేదు. మంచి కమ్‌బ్యాక్ వస్తుందేమో వెయిట్ చేద్దాం అనుకుంటున్న సమయంలో.. ఆమె కాస్త వివాదస్పద కామెంట్స్, ఇంటర్యూలతో మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఆ తర్వాత రాజకీయాలు అంటూ మొత్తం ఇండస్ట్రీకే దూరం అయిపోయింది. అయితే మాధవీ లత చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ కోసం తను 2000 సంవత్సరంలో సీక్రెట్‌గా ఓ ప్రేమ లేఖ రాసింది. అది 2019లో బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పవన్‌పై కూడా కాస్త నెగటివ్ కామెంట్స్ చేసి.. వార్తల్లో ఉంటూ వస్తుంది.

తాజాగా మాధవీ లత షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె తొలి సినిమా నచ్చావులేలో యూజ్ చెప్పులు గురించిన పోస్ట్ ఇది. ఆమె షూటింగ్ సమయంలో హోమ్ సీన్స్‌లో ఆ చెప్పులతో చేసిందట. అలా చిత్రీకరణ ముగిశాక.. అవే చెప్పులతో ఇంటికి వచ్చేసిందట. అయితే ఉషా కిరణ్ మూవీస్ వాళ్లు పెన్సిల్ తీసుకెళ్లినా.. దానికి తగ్గ కాస్ట్ పే చేయాలట. అలా ఆ చెప్పుల కోసం 250 రూపాలు తన పారితోషకంలో కోత విధించారట. ఆ చెప్పులు వెనక్కి ఇచ్చేయండి లేదా డబ్బులు కట్టండి అన్నారు.. కానీ నేను డబ్బులు కట్టేందుకే ఇష్టపడ్డా అని మాధవీ లత తెలిపింది. ఇదో గొప్ప మెమరీగా పేర్కొంది. 2008 నుండి 2022 వరకు ఆ చెప్పులు అంతే స్రాంగ్‌గా, నీట్‌గా ఉండటం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంవత్సరానికి 2,3 సార్లు ఆ చెప్పులు యూజ్ చేసి.. మళ్లీ జ్ఞాపకంగా దాచిపెట్టుకుంటానని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. 

మరిన్ని  సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.