Raksha Bandhan: లయ ఇంట రాఖీ సంబరాలు.. వైరల్‌గా మారిన కూతురి ఫొటోలు.. అచ్చుగుద్దినట్లు అమ్మేనంటూ..

|

Aug 13, 2022 | 3:46 PM

Actress Laya: వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయం వరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి లయ. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపించి అభిమానుల మనసుదోచుకుందీ అందాల తార. అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.

Raksha Bandhan: లయ ఇంట రాఖీ సంబరాలు.. వైరల్‌గా మారిన కూతురి ఫొటోలు.. అచ్చుగుద్దినట్లు అమ్మేనంటూ..
Actress Laya Family
Follow us on

Actress Laya: వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయం వరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి లయ. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపించి అభిమానుల మనసుదోచుకుందీ అందాల తార. అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో టాప్‌ హీరోలతోనూ కలిసి నటించి మెప్పించింది. ప్రేమించు సినిమాలో అంధురాలి పాత్రలో ఆమె అభినయానికి ఏకంగా నంది పురస్కారం వరించింది. ఇదే కాకుండా మిస్సమ్మ, హ‌నుమాన్ జంక్షన్‌, శివరామరాజు, స్వరాభిషేకం తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందిందీ అందాల తార. సిల్వర్‌స్ర్కీన్‌పై క్రేజ్‌ ఉండగానే ఓ ఎన్నారైతో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారి కాలిఫోర్నియాలో సెటిలైంది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది. అలాగే తన ఇద్దరి పిల్లల ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌లో పంచుకుంటోంది. ఇక సినిమా పాటలకు ఆమె వేస్తున్న డ్యాన్స్‌ లు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి.

తాజాగా రాఖీ పౌర్ణమి వేడులకను గ్రాండ్‌గా జరుపుకుంది లయ ఫ్యామిలీ. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఓ బ్యూటిఫుల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇందులో లయ కూతురు శ్లోకా తన తమ్ముడికి రాఖీ కట్టడం మనం చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా 2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆతర్వాత మళ్లీ మూడేళ్ల క్రితం రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించింది. కాగా ఇదే సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్‌లో లయ కూతురు శ్లోకా నటించి మెప్పించడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..