Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Laya

Updated on: Apr 11, 2022 | 7:52 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాకు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ , జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆనంత్ శ్రీరామ్ రచించిన ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఎంతో అద్భుతంగా ఆలపించగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందచేశాడు. ఈపాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళావతి పాటకు స్టెప్పులేస్తు్న్న వీడియోస్ ఇన్ స్టా రీల్స్ తెగ ఫేమస్ అయ్యాయి.

తాజాగా సీనియర్ హీరోయిన్ లయ కళావతి పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. శ్రీరామనవమి సందర్భంగా పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది హీరోయిన్ లయ. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read: RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..