Keerthi Suresh : మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న కళావతి.. కారణం ఏంటంటే.

సర్కారువారి మొదటి పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండవుతోంది. కానీ.. అందులో మహేష్‌బాబు మతిపోగొడుతున్న కళావతి దగ్గర మాత్రం ఏదో క్లారిటీ మిస్సవుతోందట.

Keerthi Suresh : మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న కళావతి.. కారణం ఏంటంటే.
Keerthy Suresh

Updated on: Mar 09, 2022 | 7:46 AM

Keerthi Suresh : సర్కారువారి మొదటి పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండవుతోంది. కానీ.. అందులో మహేష్‌బాబు మతిపోగొడుతున్న కళావతి దగ్గర మాత్రం ఏదో క్లారిటీ మిస్సవుతోందట. మిగతా టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వరసబెట్టి సినిమాలు చేస్తున్నా ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తోందట. బిజీగా వున్నట్టు కనిపిస్తున్నారే తప్ప సెంట్‌పర్సెంట్ సక్సెస్‌ని మాత్రం టేస్ట్ చెయ్యలేకపోతున్నారు కీర్తి సురేష్. నానీతో కీర్తి సెకండ్‌టైమ్ జతకట్టిన దసరా మూవీ ఇటీవలే అఫీషియన్‌గా లాంచైంది. ఇలా.. సూపర్‌స్టార్లతో పాటు నేచురల్ స్టార్లను కూడా తన లైనప్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ, కెరీర్‌లో వెర్సటాలిటీ చూపిస్తున్నారు కీర్తి సురేష్. బాలీవుడ్ ఎంట్రీని త్యాగం చేసిమరీ సౌత్‌ మీదే నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ, గుడ్‌లక్‌ అనే సౌండైతే మిస్సవుతూనే వుంది.

మహానటి తర్వాత స్టేచర్ మారడంతో వరుసగా మూడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లాక్ సఖీ వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలకు అంకితమైతే గుడ్‌లక్ సఖి ఒక్కటే బిగ్‌స్క్రీన్స్‌కి నోచుకుంది. కానీ.. ఆశించినంత క్రెడిట్ మాత్రం దక్కలేదు కీర్తికి. చివరకు తలైవా సినిమా కూడా నిరాశపర్చిన బాపతే. సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెల్లిగా నటించిన కూడా ఈ అమ్మడిని లక్ కలిసి రాలేదు. ఇక ఎప్పుడో కంప్లీటైన తమిళ్ మూవీ సానికాయితం కూడా డిజిటల్ స్క్రీన్స్‌కే పరిమితమవుతోంది. మెగాస్టార్‌ మూవీ భోళాశంకర్‌లో సోదరి పాత్రకే పరిమితమవుతున్నారు. అందుకే.. సర్కారువారి పాట వచ్చేలోగా ఒక్కటంటే ఒక్క హిట్టయినా కొట్టి చూపించు కళావతీ అని వేడుకుంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత  అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us