AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasturi Shankarr: సిద్దార్థ్ కామెంట్స్ పై గృహలక్ష్మీ నటి ఫైర్.. చేసిన తప్పుకు బాధపడు అంటూ..

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై సిద్దార్థ్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఆడవారిని అవమానపరిచేలా సిద్ధార్థ్ ట్వీట్

Kasturi Shankarr: సిద్దార్థ్ కామెంట్స్ పై గృహలక్ష్మీ నటి ఫైర్.. చేసిన తప్పుకు బాధపడు అంటూ..
Kasturi Shankar
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2022 | 9:10 AM

Share

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై సిద్దార్థ్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఆడవారిని అవమానపరిచేలా సిద్ధార్థ్ ట్వీట్ చేశాడంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. ఈనెల 6న పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్ లో రైతుల నిరసన తగిలింది. మోదీ ప్రయాణిస్తున్న వాహనాన్ని రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సైనా నెహ్వాల్ స్పందిస్తూ… ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సిద్ధార్థ్ స్పందిస్తూ.. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వర్ల్డ్ అంటూ కామెంట్ చేశాడు. హీరో సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలే తాజాగా వివాదాస్పద మయ్యాయి. సిద్ధార్థ్‌ను విమర్శల పాలు చేశాయి.

ఇప్పటికే సిద్ధార్థ్ వ్యాఖ్యలను జాతీయ మహిళ కమిషన్, సింగర్ చిన్మయి ఖండించారు. సిద్ధార్త్ ఇలా మాట్లాడడం అవమానకరమంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేసింది. తాజాగా గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి శంకర్ సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సైనా నెహ్వాల్ మీద సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూసి షాక్ అయ్యాను. అతని నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది వరకు అతడికి రాజకీయ పరంగా, వ్యక్తపరచిన భావాల వలన ఎదురుదాడి చేస్తే అండగా నిలిచాను. కానీ సిద్ధార్థ్ ఇలా వ్యక్తిగతంగా అటాక్ చేయడం బాగాలేదు. ఓ జాతీయ హీరో తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఇలా మాట్లాడటం వెనక ఎవరో తప్పుదోవ పట్టించి ఉంటారని అనుకుంటున్నాను. బ్యాడ్మింటన్ , కాక్ అండ్ బుల్ స్టోరీ అని చెప్పి తప్పించుకోకుండా చేసిన తప్పుకు బాధపడు అంటూ ట్వీట్ చేసింది.

ట్వీట్..

అలాగే మరో ట్వీట్ చేస్తూ.. నువ్వు ఇంకా ఈ ట్వీట్ ఎందుకు డెలీట్ చేయలేదు. సారీ ఎందుకు చెప్పలేదు. నీ అడ్మిన్ మీద ఎందుకు ఫైర్ అవ్వలేదు. ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయడం ఏంటీ సిద్ధార్థ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్వీట్.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..