మెదక్‌లో 2012లో ఎకరం రూ. 2.5 లక్షలకు భూమి కొన్న నటి.. ఆ ల్యాండ్ విలువ కోట్లు..

ల్యాండ్‌పై పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ వేస్ట్ కాదని చాలామంది అంటుంటారు. రియల్ ఎస్టేట్ మెరుపు వేగంతో పెరగడంతో దాదాపు 20, 30 ఏళ్ల క్రితం భూమిపై పెట్టినవాళ్లకు కాసుల పంట పండింది. సినిమారంగం నుంచి శోభన్ బాబు, మురళి మోహన్ వంటివారు అప్పట్లో బాగా ల్యాండ్ కొనుగోలు చేశారు. తమకు తెలిసినవాళ్లకు కొనమని సలహాలు ఇచ్చారు.. అలా ఓ తెలుగు నటి..

మెదక్‌లో 2012లో ఎకరం రూ. 2.5 లక్షలకు భూమి కొన్న నటి.. ఆ ల్యాండ్ విలువ కోట్లు..
Actress

Updated on: Apr 24, 2026 | 9:13 AM

నటి కరాటే కళ్యాణి 2012లో మెదక్ జిల్లా సమీపంలోని బిలకల్ అనే గ్రామంలో ఒక్కో ఎకరం రూ. 2.5 లక్షల చొప్పున నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు మొత్తం అప్పట్లో రూ. 10 లక్షల వరకు అయింది, రిజిస్ట్రేషన్, కమిషన్ ఖర్చులు కలిపి సుమారు రూ. 11 లక్షలు అయ్యాయి. కొనుగోలు చేసిన భూమిలో అరటి తోట ఉండేది. ఈ తోట నుంచి వారానికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఆదాయం వచ్చేది, నెలకు సుమారు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు లభించేది. కళ్యాణి కొన్న భూమిలో బోరు వేయడానికి ప్రయత్నించినప్పుడు, గతంలో ఎనిమిది బోర్లు విఫలం కావడంతో గ్రామస్థులు బోరు పడదని పందాలు వేశారు. అయినప్పటికీ, కళ్యాణి వేయించిన బోరు విజయవంతంగా నీటిని అందించింది. ఈ సంఘటనతో గ్రామస్థులు ఆమెను “లక్ష్మీదేవమ్మ”గా గౌరవించారు. అనంతరం, కళ్యాణి విశాఖపట్నంలో ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో మెదక్‌లోని ఆ నాలుగు ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ. 16 లక్షలకు విక్రయించారు, అంటే ఎకరాకు రూ. 4 లక్షల చొప్పున అమ్మేశారు. ప్రస్తుతం, ఆమె విక్రయించిన మెదక్ భూమి విలువ ఎకరాకు కోటి రూపాయలకు పైగా ఉందని కళ్యాణి తెలిపారు.

వైజాగ్ లో ఆమె ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు, అయితే ఆ ఫ్లాట్ కూడా గ్రూప్ హౌస్‌లో భాగమని, మొత్తం మూడు ఇళ్ళు ఉన్నాయని వివరించారు. దీంతో ఈ పొలం అమ్మి.. ఆ గ్రూపు హౌస్‌లో రెండు ప్లాట్లు తీసుకున్నారు.  బ్యాంకు లోన్లు, ఇతర ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఆమె కొన్న వాటిలో ఒక ఫ్లాట్‌ను ఒక సంవత్సరం లోపే విక్రయించి, అప్పులు తీర్చి, ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నించారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో తన తొందరపాటు నిర్ణయాలను కళ్యాణి పశ్చాత్తాపంగా గుర్తుచేసుకున్నారు. గతంలో మణికొండలో రూ. 1000కి గజం స్థలం కొనమని సలహా వచ్చినా తాను కొనలేదని, కానీ ఇప్పుడు అదే స్థలం గజం లక్షా అరవై వేలు దాటిందని ఆమె పేర్కొన్నారు. మరుదురి రాజా, చంద్రబాబు వంటి ప్రముఖులు కొనుగోలు చేసిన ప్రాంతంలో ఈ అవకాశం లభించిందని, అయితే దానిని వినియోగించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాలు అమ్మి లోన్లు తీర్చడం వంటి నిర్ణయాలు తీసుకొని, భూమిపై సరైన దృష్టి పెట్టలేదని కళ్యాణి తన అనుభవాలను పంచుకున్నారు.

Kalyani

Also Read: సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే..

Follow Us