AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.? ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి బయటపెట్టింది.

Tollywood : 6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
Kamakshi Bhaskarla
Rajitha Chanti
|

Updated on: May 27, 2026 | 5:28 PM

Share

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ. పొలిమేర 1, 2 చిత్రాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేయకముందు ఆమె వైద్యురాలిగా పనిచేసిందని మీకు తెలుసా. ? ప్రస్తుతం అటు కథానాయికగా.. ఇటు డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే… కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. చైనాలో తాను గడిపిన ఆరేళ్ల కాలం గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కాలంలో ఆమె ఎంబీబీఎస్ చదువుతూ, మాండరిన్ భాషను నేర్చుకుంటూ, అనేక విచిత్రమైన ఆహార పదార్థాలను రుచి చూస్తూ తన జీవితంలో మర్చిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

చైనాలో తన ఆరేళ్ల ఎంబీబీఎస్ విద్యాభ్యాసం కామాక్షికి అనేక కొత్త విషయాలను నేర్పింది. తాను చైనా వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్‌తోనే సరిపోతుందని భావించినప్పటికీ, అక్కడ మాండరిన్ భాష తప్పనిసరని గ్రహించానని అన్నారు. వైద్య విద్యలో రోగులతో మాట్లాడటానికి మాండరిన్ ఎంత కీలకమో గుర్తించానని… ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ తెలిసినా, రోగులకు తెలిసే అవకాశం లేకపోవడం వల్ల మాండరిన్ నేర్చుకోవడం ముఖ్యమని అన్నారు. ఈ కారణంతో, మొదటి సంవత్సరం నుంచే వైద్య సబ్జెక్టులతో పాటు మాండరిన్‌ను కూడా నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..

చైనాలో విభిన్న ఆహారాలను రుచి చూసే సాహసం చేసినట్లు తెలిపారు. బొద్దింకలు, తేళ్లు, కప్పలు, పాములు వంటి వంటకాలను రుచి చూశానని.. ఇదంతా కేవలం కుతూహలం వల్లనే అని పేర్కొన్నారు. చైనా చరిత్రలో సుమారు 200 సంవత్సరాల పాటు కరువు , వాతావరణ పరిస్థితుల వల్ల ఆహారం కొరత ఏర్పడిందని, దీనివల్ల ప్రజలు తమ ఆహారం కోసం అడవి జంతువులపై ఆధారపడాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఇది వారి సంస్కృతిలో భాగమైపోయిందని అన్నారు. మన పచ్చడి సీసాలు, పొళ్ళు తీసుకువెళ్ళినప్పటికీ, అవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండవు కాబట్టి, ఆమె అక్కడ లభించే వంటకాలను తన తల్లి నేర్పిన విధానంలో స్వయంగా వండుకున్నానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Follow Us