ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా.. షాకింగ్ విషయం చెప్పిన కాజల్ అగర్వాల్

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం: పార్ట్ 1’ ఈ దీపావళికి విడుదల కానుంది.

ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా.. షాకింగ్ విషయం చెప్పిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal

Updated on: Jul 10, 2026 | 7:16 PM

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారిన కాజల్..కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఈ దంపతులకు నీల్ కిచ్లూ అనే బాబు ఉన్నారు.

ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. పెళ్లి తర్వాత కాజల్  సోషల్ మీడియాలో అందంతో గత్తరలేపుతుంది. చాలా కాలం తర్వాత గ్లామర్ లుక్స్ లో ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ అమ్మడు. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది కాజల్. పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఆ మధ్య సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..

ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాజల్ ప్రస్తుతం ది ఇండియన్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆహారపు కల్తీ గురించి ప్రస్తావించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో ఆహారపు కల్తీ చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్ లో జరిగిన ఓ పుచ్చకాయ సంఘటన నేను షాక్ అయ్యేలా చేసింది. పుచ్చకాయలో కూడా కల్తీ జరుగుతుందని, వాటికి కూడా రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నారని తెలిసి అవాక్ అయ్యా.. దాంతో నేను ఇష్టంగా తినే పుచ్చకాయలు కూడా తినడం మానేశా.. అని తెలిపింది కాజల్ అగర్వాల్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

కాజల్ అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us