Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్
సాధారణంగా పెళ్లి, పిల్లలైన తర్వాత సినిమాలు తగ్గించేస్తారు హీరోయిన్లు. కానీ టాలీవుడ్ చందమామ మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఓవైపు బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ లో సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోందీ పంచదార బొమ్మ.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ శుక్రవారం (జూలై 24)న విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో . శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేశంలో ఆహార కల్తీ, కాలుష్యం, రసాయనాల వాడకం, ప్రజల ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా ది ఇండియా స్టోరీ మూవీని తెరకెక్కించారు చేతన్. ఈ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు హిందీ రామయాణంలో మండోదరిగా కనిపించనుంది కాజల్. అలాగే తెలుగులో నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోన్న (ఎన్‌బీకే 111) సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోందీ ముద్దుగుమ్మ. బాలయ్య సరసన ఆమె నటించడం ఇది రెండోసారి. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో బాలకృష్ణకు జోడీగా అలరించింది కాజల్. ఇవి కాకుండా శంకర్ – కమల్ హాసన్ ల ఇండియన్ 3 వంటి మరిన్ని ప్రాజెక్ట్‌లు కూడా కాజల్ చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే రీసెంట్ గా తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని కూడా బయట పెట్టింది.
‘కొద్ది రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా.. ఫస్ట్ డే షాట్ పూర్తయ్యాక ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఒక వ్యక్తి నా పర్మిషన్ లేకుండా నా క్యారవాన్ లోకి దూసుకొచ్చాడు. రావడం రావడంతోనే తన షర్ట్ విప్పేసి అతని ఛాతీపై నా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్లు చూపించాడు. ఊహించని ఈ సంఘటనతో నేను వణికి పోయాను. నాపట్ల అతనికి ఉన్నఅభిమానానికి సంతోషమే. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు అది కూడా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వచ్చి ఇలా చేయడం సరికాదు. అందుకే అతనిని సున్నితంగా హెచ్చరించాను ‘ అని కాజల్ అగర్వాల్ అప్పటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఈ టాలీవుడ్ చందమామ కామెంట్స్ వైరల్ గా మారాయి.
భర్త, కుమారుడితో కాజల్ అగర్వాల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




