Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

|

Nov 06, 2024 | 12:32 PM

దర్శకుడు రాజ్‌కుమార్ పరియాసామి అద్భుతంగా రూపొందించారని, జై భీమ్ తర్వాత తాను చూసిన మరో తమిళ క్లాసిక్ అమరన్ అని జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో  పేర్కొంది. నటుడు శివకార్తికేయన్ నటనను కూడా ప్రశంసించారు జ్యోతిక.

Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక
Jyothika
Follow us on

రీసెంట్ డేస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ దీపావళికి ప్రధానంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. అమరన్, క, లక్కీ భాస్కర్ సినిమాలు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయుగాన్ని అందుకున్నాయి. ఇక అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

మేజర్ ముకుంద్ వరదరాజన్ పోరాట కథ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. శివకార్తికేయన్-సాయి పల్లవి జంట నటించిన ఈ సినిమా థియేటర్లను దద్దరిల్లేలా చేస్తోంది. అమరన్ విడుదలైన రోజు నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన అమరన్‌ను ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా చాలా మంది అభినందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ జ్యోతిక సినిమాని, నటి సాయి పల్లవిని మెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అద్భుతంగా రూపొందించారని, జై భీమ్ తర్వాత తాను చూసిన మరో తమిళ క్లాసిక్ అమరన్ అని జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. నటుడు శివకార్తికేయన్ నటనను కూడా ప్రశంసించారు జ్యోతిక. అలాగే సాయి పల్లవిని కొనియాడుతూ, చివరి పది నిమిషాల్లో నువ్వు అద్భుతంగా నటించావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను అని రాసుకొచ్చారు జ్యోతిక. ఇదిలా ఉంటే, మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెక్కా త్యాగాన్ని కూడా జ్యోతిక ప్రస్తావించారు.” ‘అమరన్ బృందానికి సెల్యూట్. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మీరు సృష్టించిన అద్భుతం ఇది. జైభీమ్ తర్వాత తమిళంలో మరో క్లాసిక్. శివకార్తికేయన్‌కు అభినందనలు. ఈ పాత్రను చేయడానికి మీరు చేసిన కృషి, శ్రమను నేను ఉహించగలను. సాయి పల్లవి ఎంతటి గొప్ప నటి. మీరు చివరి 10 నిమిషాల్లో నా హృదయాన్ని, శ్వాసను ఆపేశారు. నిన్ను చూసి గర్విస్తున్నాను. శ్రీమతి ఇందు రెబెక్కా వర్గీస్ మీ త్యాగం, సానుకూలత మా హృదయాలను తాకాయి అలాగే మా ఆత్మలను వెలిగించాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ -ప్రతి పౌరుడు మీ పరాక్రమాన్ని జరుపుకుంటారు.  మేము మా పిల్లలను మీలాగే పెంచాలనుకుంటున్నాము. భారత సైన్యానికి ఇది సముచితమైన నివాళి. జై హింద్, దయచేసి ఈ డైమండ్ ప్రేక్షకులను మిస్ అవ్వకండి అని జ్యోతిక రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.