AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyothika: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిక.. నన్ను అలా చూశారంటున్న సీనియర్ హీరోయిన్

ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించరు జ్యోతిక. విశేషమేమిటంటే జ్యోతిక బాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించింది.. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా  జ్యోతిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. బాలీవుడ్‌లో నటించకపోవడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Jyothika: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిక.. నన్ను అలా చూశారంటున్న సీనియర్ హీరోయిన్
Jyothika
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 8:36 AM

Share

సీనియర్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు జ్యోతిక. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించరు జ్యోతిక. విశేషమేమిటంటే జ్యోతిక బాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించింది.. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా  జ్యోతిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. బాలీవుడ్‌లో నటించకపోవడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇటీవల విడుదలైన ‘షైతాన్’ సినిమాలో అజయ్ దేవగన్ సరసన జ్యోతిక నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు హిందీలో ‘శ్రీకాంత్‌’లో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటిస్తుంది. గత 27 ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తనకు ఎలాంటి అవకాశాలు రాలేదని జ్యోతిక తెలిపింది. ఆమె మాట్లాడుతూ..

’27 ఏళ్ల క్రితం నేను సౌత్ సినిమాల్లో నటించడం ప్రారంభించాను. తర్వాత అక్కడ ఎక్కువ సినిమాలు చేశాను. హిందీలో నా మొదటి సినిమా విజయం సాధించలేదు. ఇది రెడీమేడ్ సినిమా. మన మొదటి సినిమా హిట్ అయితే మరిన్ని అవకాశాలు రావాలి. నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టేటప్పటికి హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో సినిమాలు చేసేవారు. నా సినిమాని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా ఆడలేదు.  ఆతర్వాత  సౌత్ సినిమా అంగీకరించాను’ అని జ్యోతిక తెలిపారు. ‘బాలీవుడ్ జనాలు నన్ను సౌత్ ఇండియా నుంచి వచ్చారని అనుకున్నారు. నేను హిందీ సినిమాలు చేయనని అనుకున్నారు. ఇప్పటి వరకు ప్రయాణం బాగానే సాగింది. అందుకు రుణపడి ఉంటాను. సౌత్‌లో అద్భుతమైన సినిమాలు చేశాను. నేను హిందీ సినిమాలకు దూరంగా ఉండలేదు. కానీ నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు’ అని జ్యోతిక తెలిపింది.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.