AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమాలో శ్రీదేవే ప్రాబ్లమ్.. అందుకే చేయనని చెప్పేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ప్రముఖ నటి జయసుధ, తన కెరీర్‌లో ఎదురైన కీలక మలుపులను, అగ్రతారలు శ్రీదేవి, జయప్రదలతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ప్రేమాభిషేకం చిత్రంలో వేశ్య పాత్రను పోషించడానికి ఆమె మొదట్లో సందేహించానని, దర్శకుడు దాసరి నారాయణరావుగారి ప్రోత్సాహంతో ఆ పాత్రను అంగీకరించారు. మేకప్ లేకుండా, సహజమైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు.

Tollywood : ఆ సినిమాలో శ్రీదేవే ప్రాబ్లమ్.. అందుకే చేయనని చెప్పేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 10:57 AM

Share

ప్రముఖ నటి జయసుధ తన సినీ ప్రయాణంలోని విశేషాలను, అగ్రతారలు శ్రీదేవి, జయప్రదలతో కలిసి పనిచేసిన పలు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె పాత్రల ఎంపిక, గ్లామర్‌కు మించిన నటనకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలపై వివరించారు. ప్రేమాభిషేకం చిత్రంలో వేశ్య పాత్రను పోషించాల్సి వచ్చినప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్లను జయసుధ గుర్తు చేసుకున్నారు. అప్పటికే టాప్ హీరోయిన్‌గా ఉన్న ఆమెకు అలాంటి పాత్ర చేయడంపై మొదట్లో సందేహం కలిగింది. అయితే, దర్శకుడు దాసరి నారాయణరావు సలహాతో ఆ పాత్రను అంగీకరించానని చెప్పారు. “సినిమా ఇండస్ట్రీలో దాసరి గారు ఒక బ్యాక్‌బోన్ లాంటివారు, మంచి మెంటార్” అని జయసుధ అన్నారు.

శ్రీదేవికి పెద్ద పాత్ర ఉన్న ఆ సినిమాలో, దాసరి మాట్లాడుతూ “నీకు శ్రీదేవి కాదు ఎవరూ కనిపించరు, సినిమాలో నీకే పేరు వస్తుంది, నన్ను నమ్ము” అని తనకు ధైర్యం చెప్పారని జయసుధ వివరించారు. ఆ పాత్ర కోసం మేకప్ లేకుండా, చాలా సహజంగా కనిపించాలని దాసరి నారాయణరావు సూచించారని జయసుధ తెలిపారు. భారీ మేకప్, ఆభరణాలు లేకుండా, కేవలం పెద్ద బొట్టు, పసుపు కలిపిన లైట్ మేకప్‌తోనే ఆ పాత్రను పోషించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ వేశ్య పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. “జయసుధ తప్ప అసలు ఎవడూ కనిపించలేడు, ప్రాస్టిట్యూట్ అంతా ఏం లేదు” అని ప్రేక్షకులు చెప్పారని ఆమె అన్నారు.

సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్నప్పుడు, శ్రీదేవి, తాను కలిసి ఫంక్షన్లకు వెళ్లినప్పుడు, ప్రేక్షకులు తమను పాటలు పాడమని కాకుండా, ఆ సినిమాలో తన డైలాగులను చెప్పమని అడిగేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇది తన నటనకు లభించిన గొప్ప గుర్తింపు అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే త్రిశూలం సినిమా అనుభవాన్ని కూడా జయసుధ పంచుకున్నారు. ఆ సినిమాలో శ్రీదేవి, రాధికలతో పాటు ఆమె కూడా ఒక నాయిక. అయితే, ఆమె పాత్రకు కేవలం ఒక పాట, మూడు సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిన్న పాత్రకు సైతం తన ప్రత్యేక శైలిలో గుర్తింపు తెచ్చారని జయసుధ చెప్పారు. ఇంటర్వెల్ సమయంలో ఆమె ఎంట్రీ ఉన్నప్పుడు, కె. రాఘవేంద్రరావు ఆమె పేరును టైటిల్ క్రెడిట్స్ లో నిలిపి, పాత్రకు ప్రాముఖ్యతనిచ్చారు. ఒక్క పాటతోనే ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసుకున్నానని, ఆ పాట ఇప్పటికీ ఎంతోమందికి ఇష్టమైనదిగా నిలిచిందని ఆమె తెలిపారు. “ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో, ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు. పేరు మాత్రం నాకే రావాలి” అనే తన తత్వాన్ని ఆమె వివరించారు. శ్రీదేవి వంటి గ్లామరస్ నటి పక్కన మేకప్ లేకుండా నిలబడటానికి ధైర్యం కావాలని ఆమె అన్నారు. అడవి రాముడు సినిమాలో కూడా మొదట జయప్రదకు అనుకున్న పాత్రను, డేట్స్ సమస్యల కారణంగా తనకు ఆఫర్ చేసినప్పుడు, పాటలు మాత్రమే ఉన్న పాత్ర చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు.

Sridevi, Jayasudha

Sridevi, Jayasudha

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

Follow Us