ఆ రోజు సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది.. జీవితం నాశనం అయ్యిందని విలపించింది.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటంలేని మహారాణిగా వెలుగొందిన సావిత్రి జీవితం, ఆమె కెరీర్ ఎంత వైభవంగా సాగిందో, చివరి రోజులు అంత దుర్భరంగా గడిచాయి. పోషించిన ప్రతి పాత్రలో జీవించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహారాణిలా వెలిగిన సావిత్రి, 45 ఏళ్లకే ఈ లోకం నుంచి విషాదంగా నిష్క్రమించారు.

ఆ రోజు సావిత్రి వెక్కి వెక్కి ఏడ్చింది.. జీవితం నాశనం అయ్యిందని విలపించింది.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి
Mahanati Savitri

Updated on: May 18, 2026 | 12:09 PM

సీనియర్ నటి జమున.. తెలుగు తెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రలకు జీవం పోశారు జమున. గతంలో ఓ ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ.. తెలుగు సినీ చరిత్రలో మహానటిగా తిరుగులేని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సావిత్రి గారి వ్యక్తిగత జీవితంలోని కష్టాలను, సంఘర్షణలను వివరంగా వెల్లడించారు. అప్పటికే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలతో నటించి సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సావిత్రి, తన వివాహ జీవితంలో మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని జమున గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిగత జీవిత విషయాలను ఇతరులతో చర్చించే అలవాటు తనకు లేదని, సావిత్రితో కూడా మొదట్లో అంత సన్నిహిత సంబంధం లేదని జమున తెలిపారు.

ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా

అయితే, సావిత్రికి వివాహం జరిగి జెమిని గణేషన్‌తో గొడవలు మొదలైన తర్వాత, జమున కొడుకు పుట్టాక వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. అప్పటివరకు వ్యక్తిగత విషయాలు పంచుకోని సావిత్రి, ఆ సమయంలో తన కష్టాలను బయటపెట్టడం మొదలుపెట్టారని జమున వెల్లడించారు. సావిత్రి మద్యపానానికి బానిస అవ్వడం, తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవడం చూసి జమున తీవ్రంగా బాధపడ్డారట. ఒక సంఘటనను ఉదహరిస్తూ, ఓసారి సావిత్రి పూర్తిగా మద్యం సేవించి తన దగ్గరకు వచ్చారని, ఇద్దరం కలిసి రూమ్‌లోకి వచ్చిన తర్వాత జెమిని గణేషన్ గురించి తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చారని జమున వివరించారు. “నువ్వు అదృష్టవంతురాలివి చెల్లి, మంచి భర్త లభించాడు, బంగారాలాంటి కొడుకు పుట్టాడు. జెమిని ఇలా చేశాడు, అలా చేస్తున్నాడు” అంటూ సావిత్రి విలపించారని జమున తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

అప్పుడు జమున, సావిత్రిని ఓదార్చి, “అక్కా, తెలిసి నువ్వే చేసుకున్నావు. ఆయన్ని పెళ్లి చేసుకోవద్దని ఇండస్ట్రీలో అందరూ నీకు చెప్పారు. గతం గతం, అయిపోయింది. ఈ రోజున నీకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని చూసుకో. వాళ్ళే నీకు జీవితానికి సంతోషాన్నిచ్చే పిల్లలు” అని సలహా ఇచ్చారట. సావిత్రికి జెమిని వేరే మహిళలతో గడుపుతున్నాడనే కాంప్లెక్స్ ఉందని, ఆయన ఎక్కడికి పోతాడో తెలిసే చేసుకున్న తర్వాత బాధపడి, దానికోసం తనను తాను పతనం చేసుకోవద్దని జమున  సావిత్రికి చెప్పారట.. వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు ఎదురైనా చాలా మంది నటీమణులు బలంగా ముందుకు వెళ్లారని జమున గుర్తు చేసుకున్నారు. కృష్ణకుమారి, దేవిక, జానకి వంటి తన సమకాలీనులు బాగానే ఉన్నారని, అంజలి దేవి వంటి వారు కూడా తమ జీవితాన్ని సక్రమంగా నిర్వహించుకున్నారని తెలిపారు. పరిశ్రమలో తానుగా చేతులారా జీవితాన్ని ఆల్కహాల్‌కు బలి చేసుకున్న ఏకైక వ్యక్తి సావిత్రి అని జమున అన్నారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ బాయ్‌కాట్ చేసినప్పుడు తాను గుండె నిబ్బరంతో ఉన్నానని చెప్పిన సావిత్రి, తన వ్యక్తిగత జీవితంలో మానసిక స్థైర్యం లేకపోవడం వల్లనే మద్యపానానికి అలవాటుపడ్డారని జమున అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us